ETV Bharat / bharat

"ప్రజాకర్షక పథకాలతో జాగ్రత్త"

ప్రజాకర్షక పథకాలతో దేశ ఆర్థిక వ్యవస్థపై భారం తప్పదని రేటింగ్​ సంస్థ ఫిచ్​ హెచ్చరిక

ఫిచ్
author img

By

Published : Feb 1, 2019, 8:49 AM IST

ఫిచ్
నేడు మోదీ సర్కారు చివరి బడ్జెట్​ ప్రవేశ పెట్టనుంది. 2019 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలోకి ఉంచుకొని బడ్జెట్​ రూపొందించి ఉంటుందనేది జగమెరిగిన సత్యం. అయితే అధిక ప్రజాకర్షణ పథకాల ప్రకటనతో ఆర్థిక వ్యవస్థ పై పెనుభారం తప్పదని ప్రముఖ రేటింగ్​ సంస్థ ఫిచ్ హెచ్చరించింది.
undefined

నేడు ప్రవేశపెట్టనున్న తాత్కాలిక బడ్జెట్​లతో దేశ ఆర్థిక వ్యవస్థను బలపరచడంపై భాజపా ప్రభుత్వ నిబద్ధత ఎలా ఉందో తెలుస్తుందని ఫిచ్​ అభిప్రాయపడింది.

ఓటర్లను ఆకర్షించడానికి... ముఖ్యంగా గ్రామీణ, చిరు వ్యాపారులు ఓట్లు గెలవాలంటే.. ప్రత్యేక కేటాయింపులు తప్పనిసరి. వీళ్ల మద్దతు లేకుండా సార్వత్రిక ఎన్నికల్లో భాజపా గెలుపు అసాధ్యం.

గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న అసహనం, నిరుద్యోగం కారణంగా ఈ మధ్య జరిగిన మూడు రాష్ట్రాల ఎన్నికల్లో మోదీ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. రైతులకు మద్దతు ధరలు, పెట్టుబడి సాయం, రుణమాఫీ కోసం గత ప్రభుత్వాలు బడ్జెట్​లో భారీగా నిధులు కేటాయించేవి. ఇదే పద్ధతిని మోదీ సర్కారు అనుసరించే అవకాశముందని ఫిచ్​ తెలిపింది.

ప్రజాకర్షణ పథకాల కోసం ఎక్కువ నిధులు కేటాయిస్తే ఆర్థిక వ్యవస్థ పై భారమే కాకుండా, రెవిన్యూ లోటు పెరిగే అవకాశముందని ఫిచ్​ హెచ్చరించింది.

ఎన్నికల ముందు అధిక ఖర్చు వల్ల తర్వాత ఆర్థిక కష్టాలే కాకుండా, ప్రభుత్వ లక్ష్యాలకు ఆటంకాలు ఎదురవుతాయని, అప్పుల భారం పెరుగుతుందని ఫిచ్​ పేర్కొంది. సుస్థిర ఆర్థిక వృద్ధికి దీర్ఘ కాల ప్రణాళికలు అవసరమని ఫిచ్​ తెలిపింది.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.