లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై సంకేతాలిచ్చారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేయాలని కోరితే తప్పకుండా ఎన్నికల బరిలో నిలుస్తానని ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గం వారణాసి నుంచి పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. వారణాసి నుంచి పోటీ చేయడంకంటే ఆనందం మరొకటి లేదని తెలిపారు.
పుల్వామా ఉగ్రదాడిలో అమరుడైన జవాను వీవీ వసంత్ కుమార్ కుటుంబ సభ్యులను కేరళ వాయనాడ్‌లో వారి నివాసంలో కలిశారు ప్రియాంక గాంధీ. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
" కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్నికల్లో పోటీ చేయాలని అడిగితే... సంతోషంగా పోటీ చేస్తా"
- ప్రియాంక గాంధీ వాద్రా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి.
ఇదీ చూడండీ: శ్రీలంకలో 8 దాడులు- 165 మంది మృతి