ETV Bharat / bharat

'బాధితురాలిపై వదంతులు మాని.. న్యాయం చేయండి' - priyanka gandhi on hathras incident

హాథ్రస్‌’ ఘటనపై తీవ్రంగా స్పందించారు ప్రియాంక గాంధీ. బాధితురాలి ప్రవర్తనను కించపరిచేలా వదంతులు సృష్టించడం బాధాకరమన్నారు. బాధితురాలిపై నిందలు వేయడం మాని న్యాయం చేయాలన్నారు.

priyanka gandhi fired on the fake rumours circulating on  hathras victim
'బాధితురాలిపై వదంతులు మాని.. న్యాయం చేయండి'
author img

By

Published : Oct 8, 2020, 10:42 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్‌ హత్యాచార ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. బాధితురాలిపై అత్యాచారమే జరగలేదంటూ మొన్నటిదాకా పోలీసులు వాదించారు. ఇప్పుడు మరో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో ఓ యువకుడితో సదరు యువతి స్నేహం చేసిందని, ఆ విషయాన్ని నిందితుడు పోలీసులకు చెప్పినట్లు కొన్ని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. కాగా.. ఈ వార్తలపై కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా విచారం వ్యక్తం చేశారు. యువతి ప్రవర్తనను కించపరిచేలా వదంతులు సృష్టించడం బాధాకరమన్నారు. బాధితురాలిపై నిందలు వేయడం మాని న్యాయం చేయాలన్నారు.

‘యువతి ప్రవర్తనను కించపరిచేలా కథనాలు సృష్టించడం, యువతిపై జరిగిన దారుణానికి ఆమెనే బాధ్యురాలి చేయడం అసహ్యంగా ఉంది. హాథ్రస్‌లో ఓ ఘోరం జరిగింది. అందులో దళిత యువతి ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహాన్ని కుటుంబసభ్యుల సమ్మతి లేకుండానే దహనం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధితురాలికి దక్కాల్సింది న్యాయం.. నిందలు కాదు’ అని ప్రియాంక ట్వీట్ చేశారు.

యువతితో తనకు స్నేహం ఉందని, అది ఆమె ఇంట్లో వాళ్లకి నచ్చలేదని నిందితుల్లో ఓ యువకుడు పోలీసులకు చెప్పాడు. అంతేగాక, యువతి కుటుంబసభ్యులే ఆమెను చంపారని నిందితుడు ఆరోపించినట్లు సదరు మీడియా కథనాలు పేర్కొన్నాయి. మరోవైపు నిందితుల్లో ఒకడైన సందీప్‌ ఠాకూర్‌తో మృతురాలి సోదరుడు అనేక సార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు నిన్న యూపీ పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: నక్సలైట్ల మధ్య అంతర్యుద్ధం- ఆరుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.