కరోనాపై పోరాటానికి ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు పీఎం కేర్స్ ఫండ్‌కు కోట్ల కొద్ది విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ తల్లి హీరాబా.. కరోనా నియంత్రణ పోరులో తన వంతు సాయమందించారు. తన వ్యక్తిగత పొదుపు నుంచి రూ.25 వేల విరాళం ప్రకటించారు.
మార్చి 22న ప్రధాని పిలుపు మేరకు దేశమంతటా పాటించిన జనతా కర్ఫ్యూలోనూ హీరాబా పాల్గొన్నారు. ఇప్పటికే ప్రముఖ కార్పొరేట్ దిగ్గజాలైన రిలయన్స్, టాటా గ్రూప్ తదితర సంస్థలు పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళాలు ప్రకటించాయి.
ఆందోళనకరంగా పరిస్థితి
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 8లక్షల మందికిపైగా ఈ మహమ్మారి సోకింది. సుమారు 42 వేల మంది వైరస్‌కు బలయ్యారు. భారత్‌లోనూ కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 12 వందలకు పైగా కేసులు నమోదయ్యాయి. 35 మంది వరకు మరణించారు.