రెండు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా శ్రీలంక చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కొలంబో విమానాశ్రయంలో మోదీకి ఘనస్వాగతం పలికారు శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ సింఘే.
శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో భేటీ అవుతారు మోదీ. ప్రతిపక్షనేత మహీంద రాజపక్స, తమిళ జాతీయ కూటమి నేతలతోనూ సమావేశమవుతారు. తిరిగి సాయంత్రం భారత్ చేరుకుంటారు.
విదేశీ పర్యటనలో మొదటి రోజు మాల్దీవులను సందర్శించారు మోదీ. అక్కడి నుంచి నేరుగా శ్రీలంక వెళ్లారు.
ఇదీ చూడండి: 'కిశోర్ వ్యవహారంతో మాకు సంబంధం లేదు'