లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికవడం అందరికీ ఆమోదయోగ్యం, గర్వకారణమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కావడం చాలా సంతోషకమైన విషయమన్నారు. ఓం బిర్లా విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారని, ప్రజాసేవ కోసం నిరంతరం కృషి చేశారన్నారు. సామాజిక సేవలో ముందుండే వ్యక్తిగా ఆయనకు మంచి పేరు ఉందని కొనియాడారు. సభలో ఉన్న చాలా మందికి ఆయన తెలుసునని మోదీ అన్నారు.
అభివృద్ధిలో కీలక పాత్ర
రాజస్థాన్ అభివృద్ధిలో ఓం బిర్లాది కీలక పాత్రని ప్రశంసలు కురిపించారు మోదీ. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కోట-బూంది ప్రజలకు ఎంతో సేవ చేశారని ప్రధాని అన్నారు.
" మీరు ఆ స్థానంలో కూర్చోవడం చూసి సభ్యులందరూ సంతోషిస్తున్న, గర్విస్తున్న సమయమిది. మీరు విద్యార్థి దశ నుంచే ఉద్యమాలు చేస్తూ, విశ్వవిద్యాలయాల్లో నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా, అఖండంగా సమాజ సేవ చేశారు. భాజపా కార్యకర్తగానూ... విద్యార్థి ఉద్యమాల నుంచి బయటికి వచ్చాక.. యువమోర్చా ఉద్యమాల్లో పాల్గొన్నారు. 15సంవత్సరాల పాటు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో పార్టీకి సేవలందించారు."
-- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ఇదీ చూడండి : లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా.. ఎన్నిక ఏకగ్రీవం