ETV Bharat / bharat

దారుణం: కరోనా పోవాలని నరబలి!

ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న కరోనా వైరస్‌ పోవాలని నరబలి ఇచ్చాడు ఓ పూజారి. గుడి ఆవరణలోనే ఓ వ్యక్తిని హతమార్చాడు. అనంతరం తానే స్వయంగా పోలీసులకు లొంగిపోయాడు. ఈ దారుణ ఘటన ఒడిశాలోని కటక్‌ జిల్లాలో జరిగింది.

Priest Hacks Man In Odisha Temple
కరోనా పోవాలని ఆ రాష్ట్రంలో వ్యక్తి నరబలి!
author img

By

Published : May 28, 2020, 7:16 PM IST

కటక్‌ జిల్లా నర్సింగాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బందహుడా గ్రామంలోని ఓ గుడిలో సన్సారీ ఓజా(72) పూజారిగా ఉన్నాడు. అతడు గ్రామానికి చెందిన సరోజ్‌ కుమార్‌ ప్రధాన్‌(52)ను బుధవారం రాత్రి పదునైన గొడ్డలితో తల నరికి హతమార్చాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తానే నేరం చేసినట్లు అంగీకరించాడు.

ఇదీ కారణం..

కరోనా వైరస్‌ పోవాలంటే నరబలి ఇవ్వాలని తనకు దేవుడు కలలో కనిపించి చెప్పాడని పోలీసుల విచారణలో చెప్పాడు ఓజా. గ్రామస్థులు మాత్రం హత్యకు గురైన వ్యక్తికి, పూజారికి మధ్య ఆస్తి విషయంలో వివాదం నడుస్తోందని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసుల వాదన మరోలా ఉంది. ఘటన సమయంలో నిందితుడు ఫుల్​గా తాగున్నాడని, ఉదయం తప్పు తెలుసుకుని పోలీసుల ఎదుట లొంగిపోయాడని చెబుతున్నారు. అతడి మానసిక స్థితి కూడా సరిగా లేదని వెల్లడించారు. నిందితుడు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకొని సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు చెప్పారు పోలీసులు.

ఇదీ చదవండి: లైవ్​ వీడియో: మసీదులో ప్రార్థనకు వెళ్లి శవమై ఇంటికి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.