ప్రభుత్వానికి, మీడియా వర్గాలకు అనుసంధానకర్తగా వ్యవహరించే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో (పీఐబీ) కరోనా కలకలం రేగింది. పీఐబీ ప్రధాన సంచాలకుడు కే ఎస్ దట్వాలియాకు వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఆయనను దిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అయితే దట్వాలియాకు కరోనా సోకిందన్న అంశం అధికారికంగా బయటకు రాలేదు.
జాతీయ మీడియా కేంద్రం బంద్..
దట్వాలియాకు కరోనా సోకిన నేపథ్యంలో.. ఆయన కార్యాలయం ఉన్న జాతీయ మీడియా కేంద్రాన్ని మూసేశారు అధికారులు. భవనాన్ని సోమవారం శానిటైజ్ చేస్తారు.
వేగంగా కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియ..
దట్వాలియాతో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే ప్రక్రియ చేపడుతున్నారు అధికారులు. కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రకాశ్ జావడేకర్‌తో.. దట్వాలియా బుధవారం.. కేబినెట్ నిర్ణయాల ప్రకటన సందర్భంగా వేదికను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయా మంత్రులు నిర్బంధంలో ఉండే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: ఆ రాష్ట్రంలో 86శాతం దొంగ కరోనా కేసులే