కర్ణాటకలోని కొడగు జిల్లా మడికేరిలో సన్నిసైడ్ వార్ మ్యూజియాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం ప్రారంభించారు. మాజీ సైన్యాధిపతి కొడండెర సుబ్బయ్య తిమ్మయ్య స్మారకంగా ఈ మ్యూజియాన్ని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఇందులో సైనికుల ఆయుధాలు, మిలిటరీ యూనిఫార్మ్‌లు, ఓ యుద్ధ ట్యాంక్, సూపర్సోనిక్ యుద్ధ విమానం, ఎంఐజీ-21 యుద్ధ విమానాలను ప్రదర్శనకు ఉంచారు.
![kovind, karnataka, war museum](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-mys-08-rastrapati-vis-ka10003_06022021180812_0602f_1612615092_992_0602newsroom_1612618317_250.jpg)
![kovind, karnataka, war museum](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-mys-08-rastrapati-vis-ka10003_06022021180812_0602f_1612615092_1070_0602newsroom_1612618317_171.jpg)
![kovind, karnataka, war museum](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-mys-08-rastrapati-vis-ka10003_06022021180812_0602f_1612615092_589_0602newsroom_1612618317_571.jpg)
![kovind, karnataka, war museum](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-mys-08-rastrapati-vis-ka10003_06022021180812_0602f_1612615092_878_0602newsroom_1612618317_334.jpg)
![kovind, karnataka, war museum](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-mys-08-rastrapati-vis-ka10003_06022021180812_0602f_1612615092_368_0602newsroom_1612618317_607.jpg)
![kovind, karnataka, war museum](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-mys-08-rastrapati-vis-ka10003_06022021180812_0602f_1612615092_814_0602newsroom_1612618317_26.jpg)
![kovind, karnataka, war museum](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-mys-08-rastrapati-vis-ka10003_06022021180812_0602f_1612615092_986_0602newsroom_1612618317_745.jpg)
![kovind, karnataka, war museum](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-mys-08-rastrapati-vis-ka10003_06022021180812_0602f_1612615092_995_0602newsroom_1612618317_890.jpg)
ఇంటినే మ్యూజియంగా..
జనరల్ తిమ్మయ్య స్వగృహాన్నే రాష్ట్ర ప్రభుత్వం మ్యూజియంగా మార్చింది. ప్రవేశంలో స్వాగతిస్తున్నట్లుగా సైనిక దుస్తుల్లో ఉన్న జనరల్ తిమ్మయ్య విగ్రహం ఉంటుంది. 1971 భారత్- పాకిస్థాన్ యుద్ధంలో సైన్యం వినియోగించిన యుద్ధ ట్యాంక్ ప్రదర్శనశాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. జనరల్ తిమ్మయ్య 1957 నుంచి 1961 మధ్య సైన్యానికి చీఫ్‌గా సేవలు అందించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి సహా ఆయన సతీమణి సవితా కోవింద్, త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ సహా పలువురు అధికారులు, నేతలు హాజరయ్యారు.
ఇదీ చదవండి : ఉద్ధృతంగా చక్కా జామ్- పలు చోట్ల రైతుల నిర్బంధం