కరోనా మహమ్మారిని కట్టడి చేయడంపై చర్చే ప్రధాన అజెండాగా అన్ని రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. కొవిడ్-19తో ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు, నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.
కరోనాపై పోరులో ఆయా రాష్ట్రాలలోని వైద్యవిభాగం చేస్తున్న సేవలను మెచ్చుకున్నారు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి. కష్టకాలంలోనూ ధైర్యంగా నిలబడిన వైద్యులపై కోవింద్ ప్రశంసల జల్లు కురిపించారు.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య శుక్రవారం ఉదయానికి 724 చేరగా... మొత్తం 17 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.