కేంద్ర మాజీ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు సమాచారం. శ్వాస సంబంధిత సమస్యతో ఈ నెల 9న దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు జైట్లీ. అప్పటి నుంచి ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూలోనే ఉన్నారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం ఉదయం ఎయిమ్స్‌లో 66 ఏళ్ల జైట్లీని పరామర్శించారు. జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో కోవింద్‌తో పాటు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్ష వర్ధన్, ఆరోగ్య సహాయమంత్రి అశ్విని చౌబే ఉన్నారు.