ముమ్మారు తలాక్ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం లభించింది. ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు-2019కి రాజ్యసభ జులై 30న అంగీకారం తెలిపింది. గతవారమే ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది.
తాజాగా రాష్ట్రపతి సంతకంతో ముమ్మారు తలాక్ బిల్లు చట్టంగా మారింది. కొత్త చట్టం ప్రకారం ముస్లిం మహిళలకు ఏకకాలంలో మూడుసార్లు తలాక్ చెప్పడం క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. అలా చెప్పిన భర్తకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు.
- ఇదీ చూడండి: మహిళల పోరాటం+మోదీ సంకల్పం= తలాక్ చట్టం