ETV Bharat / bharat

దిల్లీ సీఎంగా ముచ్చటగా మూడోసారి కేజ్రీవాల్

author img

By

Published : Feb 14, 2020, 9:10 PM IST

Updated : Mar 1, 2020, 9:02 AM IST

అరవింద్ కేజ్రీవాల్​ను దిల్లీ నూతన ముఖ్యమంత్రిగా నియమించారు రాష్ట్రపతి. ఈనెల 16న జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయనతో పాటు ఆరుగురు మంత్రులు ప్రమాణం చేయనున్నారు.

president-appoints-arvind-kejriwal-as-cm-of-delhi
దిల్లీ సీఎంగా ముచ్చటగా మూడోసారి కేజ్రీవాల్

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70కి గాను 62 స్థానాల్లో జయకేతనం ఎగురవేసిన ఆమ్​ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్​ను దిల్లీ నూతన ముఖ్యమంత్రిగా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసింది. రామ్​లీలా మైదానంలో ఆదివారం జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కేజ్రీవాల్​తో పాటు మరో ఆరుగురు మంత్రులు బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఆరుగురు మంత్రులు వీళ్లే..

ప్రస్తుత డిప్యూటీ సీఎంగా ఉన్న మనీశ్ సిసోడియా సహా సత్యేందర్ జైన్, గోపాల్ రాయ్​, ఖలాశ్, గహ్లెత్, ఇమ్రాన్ హుస్సేన్​, రాజేంద్ర గౌతమ్​ కేజ్రీవాల్​ మంత్రివర్గంలో చోటు సంపాదించారు.

ప్రసుత్తం దిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేశారని... అందుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు మరో ప్రకటనలో తెలిపింది రాష్ట్రపతి భవన్​. బాధ్యతలు చేపట్టేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని రాష్ట్రపతి సూచించినట్లు పేర్కొంది.

Last Updated : Mar 1, 2020, 9:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.