ETV Bharat / bharat

ఆ గర్భిణీల కష్టాలు తీర్చేందుకు 'డోలీ' సేవ - ఉత్తరాఖండ్ తాజా వార్తలు

ఉత్తరాఖండ్​ నైనీతాల్ జిల్లాలో గర్భిణీలను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు నానా కష్టాలు పడుతున్నారు అక్కడి ప్రజలు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది ఆసుపత్రికి వచ్చే లోపే ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పాలనాధికారి వారిని ఆసుపత్రికి తరలించేందుకు 'డోలీ'లు ఏర్పాటు చేశారు.

dolis
ఆ గర్భిణీల కష్టాలు తీర్చిన 'డోలీ'!
author img

By

Published : Dec 4, 2020, 12:33 PM IST

నైనీతాల్​.. ఉత్తరాఖండ్​లోని ఓ జిల్లా. ఇది పూర్తిగా కొండ ప్రాంతం. ఇక్కడ ఎవరైనా ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రికి వెళ్లాలంటే నడక తప్ప వేరే మార్గం లేదు. ఎంత దూరమైనా నడిచే వెళ్లాలి. గర్భిణీల పరిస్థితి మరింత దారుణం. వారిని అంతదూరం నడిపించి ఆసుపత్రికి తీసుకువెళ్లడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కష్టాలను చూసిన జిల్లా పాలనాధికారి గర్భిణీలను దగ్గరలోని ఆసుపత్రికి తరలించేందుకు 500 డోలీలు ఏర్పాటు చేశారు. ఇందుకోసం రూ.10 లక్షలు ఖర్చు చేశారు.

ముఖ్యంగా ధరి, రామ్​ఘడ్​, ఓఖల్​కందా, బెతాల్​గఢ్​​, భీమ్​టల్​ ప్రాంతాల్లో ఈ డోలీలను ఏర్పాటు చేశారు. గ్రామీణ మహిళల కోసం ఇలాంటి ముందడుగు వేసిన తొలి జిల్లాగా నైనీతాల్​ నిలిచింది. తల్లీబిడ్డల మరణాల రేటును తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని జిల్లా కలెక్టర్​ బన్సాల్​ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.