ETV Bharat / bharat

లాక్​డౌన్​ వెతలు: 8 నెలల గర్భిణి- 200కి.మీ నడక

author img

By

Published : Apr 1, 2020, 11:07 AM IST

లాక్​డౌన్​ కారణంగా 8 నెలల నిండు చూలాలు 200 కి.మీలు నడవాల్సి వచ్చింది. ఉత్తర్​ప్రదేశ్​ నోయిడా నుంచి జలాన్​కు కాలినడకన రెండు రోజుల్లో చేరుకుంది. దూర ప్రయాణం చేసినందుకు బాధ్యతగా భర్తతో కలిసి కరోనా పరీక్షలు చేయించుకుంది. 14 రోజుల నిర్బంధంలోకి వెళ్లింది.

pregnant-woman-walks-200-km-to-her-home-in-uttarpradesh
8నెలల గర్భిణీ.. 200 కి.మీ నడచింది!

ఉత్తర్​ప్రదేశ్​లో హృదయ విదారక ఘటన జరిగింది. కరోనాను అరికట్టేందుకు విధించిన దేశవ్యాప్త లాక్​డౌన్ కారణంగా 8నెలల నిండు గర్భిణి 200 కి.మీ నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఊరెళ్లడమే ఉత్తమమని...

జలాన్​ జిల్లాకు చెందిన అంజూదేవీ, భర్త అశోక్​ పొట్టకూటి కోసం నోయిడాకు వలస వచ్చారు. భవన నిర్మాణ పనులు చేస్తూ బతుకీడుస్తున్నారు. దేశవ్యాప్త లాక్​డౌన్​తో వారం రోజులుగా జీవనోపాధి కోల్పోయారు. చేసేదేమీ లేక రాత్​​​లోని వారి స్వగ్రామం ఔంటాకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

కానీ, రవాణా సౌకర్యం లేదు. అయినా సరే, పట్టణంలో ఉండి ఇక్కట్లు పడడం కంటే ఊరెళ్లడమే సబబు అనుకుంది అంజూ. ఎనిమిది నెలల గర్భిణి అయినా.. సాహసం చేసి భర్తతో కలిసి నడక మొదలెట్టింది. కుటుంబ సభ్యులకు ఫోన్​ ద్వారా అందుబాటులో ఉంటూ ఇద్దరూ ప్రయాణం సాగించారు.

రెండు రోజుల్లో 200 కి.మీల దూరం నడిచి ఓరై ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఓ లోడర్(జేసీబీ)​ వాహనంలో ఎట్టకేలకు ఇల్లు చేరుకున్నారు.

"మేము లాక్​డౌన్​కు ముందు బయల్దేరుదామంటే కుదరలేదు. మా యజమాని మా కూలీ చెల్లించలేదు. మేము కొన్ని రొట్టెలు, కూరలు మాతో పాటు తెచ్చుకున్నాము. దారిలో వచ్చేటప్పుడు కొందరు మాకు ఆహారం పంచారు. ఎట్టకేలకు మేము ఇంటికి చేరుకున్నందుకు నాకు ప్రశాంతంగా ఉంది"

-అశోక్​, అంజూ భర్త

ఊరికి వెళ్లిన వెంటనే బాధ్యతగా దంపతులిద్దరూ ఆసుపత్రికి వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. వారిద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు ధ్రువీకరించారు వైద్యులు. కానీ, 14 రోజుల పాటు వారిని నిర్బంధంలో ఉండాలన్న సూచనను అంజూ, అశోక్​లు పాటిస్తున్నారు.

ఇదీ చదవండి:లాక్​డౌన్ ఉన్నా కాలుష్యం తగ్గనది ఆ 2 నగరాల్లోనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.