తమిళనాడు కోయంబత్తూర్లో ఘోర ప్రమాదం జరిగింది. రంపపు మిల్లులోని యంత్రంలో ఓ గర్భిణీ ప్రమాదవశాత్తు చిక్కుకొని తల తెగిపడి మరణించింది.
క్షణంలోనే అంతా జరిగిపోయింది..
పోలీసుల కథనం ప్రకారం.. కల్పన(23), ఆమె భర్త ధర్మరాజ్ సూలూరులోని ఓ రంపపు మిల్లులో పని చేస్తున్నారు. భర్త బ్యాంకు పని మీద మిల్లు నుంచి వెళ్లిపోయాడు. అదే సమయంలో పరిశ్రమలోని కార్మికులకు తేనీరు తీసుకొచ్చింది కల్పన. పక్కనే ఉన్న రంపపు యంత్రం ఖాళీగా ఉండటం చూసి.. అక్కడి వారికి సాయం అందించాలనుకుంది.
పని చేస్తుండగా చేతిలో ఉన్న దుంగ జారిపోయింది. దాన్ని తీసుకునే ప్రయత్నంలో కల్పన.. దుపట్టా యంత్రంలో చిక్కుకుంది. ఆ విషయం తెలుసుకునే లోపే.. క్షణంలో అంతా జరిగిపోయింది. ఆమె తల.. మొండెం నుంచి విడిపోయింది. చనిపోయే సమయానికి మహిళ 7 నెలల గర్భవతి. మరో 3 సంవత్సరాల కుమార్తె కూడా ఉంది.