ETV Bharat / bharat

లాక్​డౌన్​లో 1800 కి.మీ 'నరక యాత్ర'

లాక్​డౌన్​ కారణంగా రాజస్థాన్​కు చెందిన ఓ వలస కార్మికుడు స్వగ్రామానికి చేరేందుకు నానా తంటాలు పడ్డాడు. రవాణా సౌకర్యాలు లేని సమయంలో కాలినడకన, ఇతరుల సాయంతో ఆరు రోజుల పాటు 1800 కి.మీ దూరం ప్రయాణించి ఇల్లు చేరుకున్నాడు.

praveen-did-a-1800-km-trek-from-bengaluru-to-rajasthan
ఇంటికి చేరేందుకు 1800కి.మీ ప్రయాణించి నరకం చూశాడు!
author img

By

Published : Apr 6, 2020, 11:25 AM IST

లాక్​డౌన్​ వేళ దాదాపు అందరూ ఇళ్లకే పరిమితయ్యారు. కానీ, వలస కూలీలు పని లేక.. పట్టణాల్లో బతకలేక ఇక్కట్లు పడుతున్నారు. సొంతూరు పోదామంటే రవాణా సౌకర్యం లేదు. ఇలాంటి కఠోర పరిస్థితుల్లో బెంగళూరు నుంచి 1800 కి.మీ ఆపసోపాలు పడుతూ ప్రయాణించి రాజస్థాన్​లోని స్వగ్రామానికి చేరుకున్నాడు ఓ వలస కార్మికుడు​.

దారంతా కష్టాలే..

జాలోర్​ జిల్లా చీతల్వాన్​లోని గిరిధర్​ ఘోరేకు చెందిన ప్రవీణ్​.. పొట్టకూటికోసం బెంగళూరు వెళ్లాడు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్​డౌన్​తో జీవనోపాధి కోల్పోయాడు. చేసేదేమీ లేక మార్చి 26న బెంగళూరు శివాజీనగర్​ నుంచి కాలినడకన ఇంటికి బయల్దేరాడు. 70కి.మీ నడిచి తుమకూర్ చేరకున్నాడు. ఆ తర్వాత గ్యాస్​బండిలో లిఫ్ట్​ అడిగి, ఓ ట్రక్కులో క్లీనర్​ పనులు చేసి , పాల ట్యాంకర్​ డ్రైవర్లను బతిమాలి కొంత దూరం ప్రయాణించాడు.

praveen-did-a-1800-km-trek-from-bengaluru-to-rajasthan
ఇంటికి చేరేందుకు 1800కి.మీ ప్రయాణించి నరకం చూశాడు!

లాఠీ దెబ్బలు

మార్గమధ్యంలో లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపై తిరిగినందుకు మహారాష్ట్ర సరిహద్దు​ పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నాడు ప్రవీణ్​. ధానేరా పోలీసులు మానవత్వంతో జీపులో కొంత దూరం వరకు వెళ్లాడు. కానీ, జీపు బోల్తాపడి గాయాలపాలయ్యాడు. అక్కడి నుంచి మళ్లీ నడక ప్రారంభించాడు.

గ్రామ సమీపంలోకి రాగానే స్నేహితుడికి ఫోన్​ చేసి ద్విచక్రవాహనం తెప్పించుకుని ఏప్రిల్​ 2న ఇంటికి చేరుకున్నాడు.

"దాదాపు ఆరున్నర రోజుల్లో నేను ఇల్లు చేరుకున్నాను. దారిలో చాలా ఇబ్బందులు పడ్డాను. నాకు ఆహారం దొరకలేదు.. నీళ్లు కూడా తాగకుండా ప్రయాణించా. ఎక్కడైనా కూర్చుందామంటే పోలీసులు కొట్టేవారు. చాలా దూరం నడిచే వచ్చాను. ఇంటికి చేరుకోగానే ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నా."

-ప్రవీణ్​, వలస కార్మికుడు

ఎన్నో వ్యయప్రయాసలకోర్చి 1800కి.మీ ప్రయాణించిన ప్రవీణ్​ను​ కరోనా వ్యాప్తి నేపథ్యంలో గృహ నిర్బంధంలో ఉంచారు అధికారులు.

ఇదీ చదవండి:అంగరంగ సామాజిక దూరంగా జరిగింది ఆ పెళ్లి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.