భారత మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీకి నేడు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రదానం చేయనున్నారు. దిల్లీలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు.
ఈ ఏడాది జనవరి 25న భారతరత్న పురస్కారంపై ప్రకటన విడుదల చేసింది రాష్ట్రపతి భవన్. ప్రణబ్ ముఖర్జీతో పాటు సామాజిక కార్యకర్త నానాజీ దేశ్ముఖ్, ప్రముఖ అస్సామీ గాయకుడు భూపెన్ హజారికాలకు ఈ అవార్డును ప్రకటించింది.
భారతరత్న పురస్కారం పొందిన అయిదవ రాష్ట్రపతిగా గుర్తింపు పొందారు 'దాదా'. అంతకుముందు మాజీ రాష్ట్రపతులు డా.ఎస్ రాధాక్రష్ణన్, రాజేంద్రప్రసాద్, జాకిర్ హుస్సేన్, వీవీ గిరిలు ఈ పురస్కారం అందుకున్నారు.
2012-2017 మధ్య భారత 13వ రాష్ట్రపతిగా సేవలందించారు ప్రణబ్. 2009-2012 వరకు యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా పని చేశారు. ఐదు దశాబ్దాలుగా రాజకీయాల్లో ప్రణబ్ ముఖర్జీ చేసిన సేవలకు గాను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.
ఇదీ చూడండి: నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని!