ETV Bharat / bharat

"ప్రతి వంట గదిలోనూ ఎల్​పీజీ" - ధర్మేంద్ర ప్రదాన్

ఎల్​పీజీ గ్యాస్​ సిలెండర్ల కనెక్షన్ల మంజూరు 7 కోట్లకు చేరినట్లు చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్​ తెలిపారు.  ప్రతి వంట గదిలో ఎల్​పీజీ సిలెండర్​ ఉండటం మోదీ ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రదాన్.

ఎల్​పీజీ కనెక్షన్లపై చమురుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్
author img

By

Published : Mar 8, 2019, 11:59 PM IST

ప్రతి వంట గదిలోనూ ఎల్​పీజీ సిలెండర్​ ఉండాలనే లక్ష్యంతో కేంద్రం అడుగులు వేస్తోంది. శుక్రవారం నాడు మంజూరు చేసిన గ్యాస్​ కనెక్షన్లతో ఇప్పటి వరకు మంజూరు చేసిన ఎల్​పీజీ సిలెండర్ల సంఖ్య 7 కోట్లకు చేరుకుంది.

చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్​ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. గడిచిన 34 నెలల కాలంలో 'ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం' కింద 7 కోట్లు కనెక్షన్లు జారీ చేశామని , రోజుకు సగటున 69 వేల ఎల్​పీజీ సిలెండర్లు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు.

ఎల్​పీజీ కనెక్షన్లపై చమురుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్

"2016, మే 1 లో ఈ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. 2019 మార్చి నాటికి కనీసం 5 కోట్ల మందికి సిలెండర్లు అందించాలనే లక్ష్యం నిర్దేశించుకున్నాం. తర్వాత 2021 నాటికి 8 కోట్ల మందికి ఎల్​పీజీ మంజూరు చేయాలని చూస్తున్నాం."- ధర్మేంద్ర ప్రదాన్​, చమురు శాఖ మంత్రి

2014 లో కేవలం 55 శాతం మంది వద్ద మాత్రమే సిలెండర్లు ఉండేవి. ప్రస్తుతం 93 శాతం కుటుంబాల వద్ద ఎల్​పీజీ సిలెండర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు ధర్మేంద్ర ప్రదాన్​.

కోటి 26 లక్షల కనెక్షన్లతో ఉత్తర్​ప్రదేశ్​ అగ్రస్థానంలో నిలిచింది. 78 లక్షలతో పశ్చిమ బంగా రెండో స్థానంలో ఉంది. 77 లక్షల 55 వేల కనెక్షన్లతో బిహార్​ మూడో స్థానంలో నిలిచింది.

పెరుగుతున్న కనెక్షన్ల ఆధారంగా డీలర్​షిప్స్​ పెంచినట్లు తెలిపారు చమురు మంత్రి​. ప్రస్తుతానికి 6800 కొత్త డీలర్​షిప్​లు ఇచ్చినట్లు మంత్రి స్పష్టం చేశారు.
ఈ పథకం కింద ప్రభుత్వం గ్యాస్​ సిలిండర్​ కొనుగోలుకు 1600 సబ్సిడీ ఇస్తోంది.

Agartala (Tripura), Mar 08 (ANI): With the call for gender equality in economic, social and political front, hundreds of women from various age groups took part in a colorful procession in Tripura's capital Agartala on the occasion of Women's Day. International Women's Day is a global day celebrating the achievements of women. The day also marks a call to action for accelerating gender parity. Tripura Social Welfare and Social Education Minister Santana Chakma and Agriculture and Tourism Minister Pranajit Singha Roy flagged off the procession.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.