ఉత్తర్‌ప్రదేశ్ కాన్పుర్‌లో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్, 8 మంది పోలీసుల ప్రాణాలు పోయేందుకు కారణమైన రౌడీషీటర్ వికాస్ దూబే చట్టు ఉచ్చుబిగిస్తున్నారు అధికారులు. దూబేను పట్టుకునేందుకు 25 బృందాలను రంగంలోకి దించి గాలింపు ముమ్మరం చేశారు. అతనితో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులపై వేటు వేశారు.
"గ్యాంగ్‌స్టర్‌ను పట్టుకునేందుకు 40 పోలీస్ స్టేషన్ల నుంచి 25 బృందాలను రంగంలోకి దించాం. కొన్ని టీంలు ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు వెళ్లాయి. త్వరలోనే దూబేను అరెస్ట్ చేస్తాం. దూబేతో సంబంధం ఉన్న కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు అనుమానిస్తున్న ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశాం."
- మోహిత్ అగర్వాల్, ఐజీ, కన్పూర్ రేంజ్
రివార్డు 2.5 లక్షలకు పెంపు..
కాన్పుర్ ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు వికాస్ దూబే గురించి సమాచారం అందిస్తే రూ. 50,000 రివార్డు అందిస్తామని తొలుత ప్రకటించిన పోలీసులు.. తాజాగా ఆ నజరానాను రూ. 2.5 లక్షలకు పెంచారు.
టోల్‌ప్లాజాల వద్ద పోస్టర్లు..
గాలింపు చర్యల్లో భాగంగా యూపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టోల్‌ప్లాజాల వద్ద దూబే పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఐజీ. దూబే సన్నిహితులపై నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు.
ఈనెల 3న జరిగిన రౌడీషీటర్ల దాడిలో ఓ డీఎస్పీ సహా ఏడుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఓ పౌరుడు సహా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఇదీ చూడండి: దూబే కోసం పోలీసుల వేట- రౌడీషీటర్ ఇల్లు కూల్చివేత