హౌరా - దిల్లీ మధ్య ప్రయాణించే పూర్వా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ సమీపంలోని రూమా గ్రామ సమీపంలో అర్ధరాత్రి ఒంటి గంటకు ఈ ప్రమాదం జరిగింది. 5 బోగీలు బోల్తా పడ్డాయి. ఘటనలో 13 మంది ప్రయాణికులు గాయపడ్డారు. రైలులోని 12 బోగీలు ధ్వంసమయ్యాయి.
ప్రయాణికులను కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్కు తరలించేందుకు అధికారులు బస్సులను ఏర్పాటు చేశారు. అక్కడినుంచి ప్రత్యేక రైలు ద్వారా దిల్లీకి ప్రయాణికులను చేరవేస్తామని కాన్పూర్ జిల్లా మేజిస్ట్రేట్ విజయ్ విశ్వాస్ పంత్ తెలిపారు.
ఇదీ చూడండి: ఇంజనీరింగ్ విద్యార్థిని హత్యపై ఆందోళనలు