ETV Bharat / bharat

ఆ బియ్యం రుచి, రంగు, వాసన అచ్చం చాక్లెట్​లానే!

author img

By

Published : Jul 2, 2020, 7:00 PM IST

Updated : Jul 2, 2020, 8:55 PM IST

చాక్లెట్​ అంటే చిన్నా పెద్దా అందరికీ భలే ఇష్టం. కొందరైతే ఏకంగా అన్నం మానేసి చాక్లెట్లు తింటుంటారు. అలాంటి వారు ఇక చాక్లెట్​ రైస్​ తినొచ్చు. బాస్మతి రైస్​, బ్రౌన్​ రైస్​, బ్లాక్​ రైస్​.. ఇలా ఎన్నో రకాల రైస్​ గురించి విన్నాం కానీ.. ఈ చాక్లెట్​ బియ్యమేంటీ అనుకుంటున్నారా? కేరళకు చెందిన కొందరు రైతులు చాక్లెట్ రంగులో.. చాక్లెట్​ రుచి, వాసన కలిగిన ఓ అరుదైన వరి రకాన్ని సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఊరి పేరును ప్రపంచమంతా మారుమోగేలా చేశారు.

Poomangalam Matta The rice that tastes and smells chocolaty
ఈ బియ్యం చాక్లెట్​ లాంటిది.. కానీ చాక్లెట్​ కాదు!

కేరళ త్రిస్సూర్​ జిల్లాలో చాక్లెట్​ను తలపించే మట్టా​ రైస్​ పండించి.. అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు ఊమంగళం గ్రామానికి చెందిన రైతులు.

మొన్నటిదాకా.. పూమంగళం అంటే త్రిస్సూర్​ జిల్లాలోని ఓ చిన్న గ్రామ పంచాయతీ మాత్రమే. కానీ, వ్యవసాయాన్నే జీవనాధారంగా చేసుకుని, నేలమ్మపై అపారమైన నమ్మకాన్ని పెట్టుకున్న కొందరు రైతులు ఆ గ్రామానికే పేరు తెచ్చారు. హరిత కర్మ సేన పేరిట ఓ బృందంగా ఏర్పడి.. మునుట్టి అగ్రికల్చరల్ వర్సిటీలో సేంద్రియ వ్యవసాయంపై ప్రత్యేక శిక్షణ పొందారు. అక్కడే అచ్చం చాక్లెట్​ వాసన, రుచి, రంగు కలిగిన మట్టా రైస్​ గురించి తెలుసుకున్నారు.

శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ.. పడియూర్​ కోలె తేమ నేలల్లో మట్టా వరిని సాగు చేశారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా.. కేవలం నేలమ్మను నమ్మి ఓపికగా పంట పండించారు. ఇంకేముంది... పూమంగళం మట్టా రైస్​ ప్రపంచమంతా ఫేమస్​ అయిపోయింది.

ఎన్నో ఔష​ధ గుణాలున్న ఈ చాకో రైస్​కు కేరళవాసులు ఫిదా అవుతున్నారు. కేవలం మట్టా బియ్యాన్నే కాక, మట్టా బియ్యం​ పిండి, మట్టా అటుకులూ తయారు చేసి కేరళ వ్యాప్తంగా విక్రయిస్తున్నారు రైతులు. ప్రభుత్వం ధ్రువీకరించిన తర్వాత, గ్రామ చుట్టుపక్కల బీడుగా పడున్న భూముల్లోనూ ఈ చాక్లెట్​ లాంటి మట్టా రైస్​ పండిస్తామంటున్నారు.

ఇదీ చదవండి: విత్తనం విలువ తెలిసిన మగువా.. ఆలోచన వారెవ్వా!

Last Updated : Jul 2, 2020, 8:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.