ETV Bharat / bharat

భాజపా విభజన రాజకీయాలు చేస్తోంది: మమత - మమతా బెనర్జీ

ప్రపంచ వివక్ష రహిత రోజు సందర్భంగా భాజపాపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ప్రజలను మత ప్రాతిపదికన భాజపా విభజిస్తోందని ఆరోపించారు. దేశంలోకి వివక్షపూరిత రాజకీయాలు చేరటం బాధగా ఉందన్నారు.

Mamata
భారత్​లో వివక్ష పూరిత రాజకీయాలు బాధ కలిగిస్తున్నాయి: దీదీ
author img

By

Published : Mar 1, 2020, 8:03 PM IST

Updated : Mar 3, 2020, 2:17 AM IST

భారత సంస్కృతిలో వివక్షపూరితమైన రాజకీయాలు అల్లుకుపోవటం బాధ కలిగిస్తోందన్నారు పశ్చిమ్​ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. సమాజంలో కులం, మతం ఆధారంగా ఏర్పడ్డ విభేదాలను ప్రజలు కూకటివేళ్లతో పెకిలించివేయాలని కోరారు.

మార్చి 1న 'ప్రపంచ వివక్ష రహిత రోజు' సందర్భంగా ట్విట్టర్​ వేదికగా భాజపాపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు మమత. దేశ ప్రజలను భాజపా మత ప్రాతిపదికన విభజించాలని చూస్తోందని ఆరోపించారు.

Mamata
మమత బెనర్జీ ట్వీట్​

" ఈ రోజు ఐరాస వివక్ష రహిత రోజు. భారత సంస్కృతిలోకి వివక్షపూరితమైన రాజకీయాలు చేరటం నాకు బాధగా ఉంది. సమాజంలో కులం, మతం ఆధారంగా పేరుకుపోయిన విభేదాలను కూకటివేళ్లతో పెకిలించి వేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం. ఎలాంటి వివక్షను సహించకూడదు."

- మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి.

కోల్​కతాలో కేంద్ర హోంమంత్రి అమిత్​ షా సీఏఏ అనుకూల ర్యాలీ నిర్వహించిన రోజే దీదీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

దిల్లీ గురించి ఆలోచించండి..

కోల్​కతాలో సీఏఏ ర్యాలీ సందర్భంగా బంగాల్​లో శాంతిభద్రతలపై కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ఆరోపణలు చేయటాన్ని తిప్పికొట్టింది అధికార తృణమూల్​ కాంగ్రెస్​. నీతి వాక్యాలు వల్లించటం మాని దిల్లీ అల్లర్లలో అమాయకుల ప్రాణాలు కాపాడటంలో విఫలమైనందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేసింది. ఈ మేరకు టీఎంసీ నాయకుడు అభిషేక్​ బెనర్జీ ట్విట్టర్​ వేదికగా భాజపాపై విమర్శలు చేశారు.

Mamata
అభిషేక్​ బెనర్జీ ట్వీట్​

ఇదీ చూడండి: బంగాల్​పై భాజపా గురి- దీదీని దించేందుకు పక్కా స్కెచ్​

Last Updated : Mar 3, 2020, 2:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.