ETV Bharat / bharat

తమిళనాట సంక్రాంతికి రాజకీయ రంగు

author img

By

Published : Jan 14, 2021, 5:20 AM IST

తమిళనాడులో సంక్రాంతికి రాజకీయ రంగు పులుముకోనుంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ జాతీయస్థాయి నేతలు పోటాపోటీగా ఓటర్లను ఆకర్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సంక్రాంతి వేడుకలను కూడా దీనికోసం ఉపయోగించుకునేందుకు సిద్ధమయ్యారు. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం తమిళనాడులో పర్యటించనున్నారు. సంక్రాంతి వేడుకలను ప్రజల మధ్యలో జరుపుకోనున్నారు.

political-bigwigs-to-land-in-tamil-nadu-for-pongal
తమిళనాట సంక్రాంతికి రాజకీయ రంగు

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ప్రజలను ఆకర్షించేందుకు జాతీయస్థాయి నేతలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. సంక్రాంతి పండుగను కూడా ఒక వేదికగా ఉపయోగించుకుంటున్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీలు సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో పర్యటించి.. అక్కడి ప్రజలతో పండుగను జరుపుకోనున్నారు.

ఎడ్లబండిపై నడ్డా సవారీ..

సంక్రాంతిని పురస్కరించుకుని రాష్ట్ర భాజపా బృందం ఏర్పాటు చేసిన "నమ్మ ఓరు పొంగల్​ విళ(మన నగరం- మన సంక్రాంతి)" వేడుకల్లో నడ్డా పాల్గొననున్నారు. క్రీడా పోటీలు, సంప్రదాయ కళలను వీక్షించనున్నారు. ఎడ్లబండిపై సవారీ చేసిన అనంతరం తన ప్రసంగంతో వేడుకను ముగించనున్నారు.

తమిళ సంచిక తుగ్లక్​ వార్షిక వేడుకలకు కూడా నడ్డా హాజరుకానున్నారు.

జల్లికట్టుకు రాహుల్​..

కాంగ్రెస్​ అగ్రనేత​ రాహుల్​ గాంధీ కూడా తమిళనాడులో పర్యటించనున్నారు. కాంగ్రెస్​ తరఫున ఎన్నికల ప్రచారాన్ని ఆయన సంక్రాంతి రోజు నుంచే ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.

పర్యటన సందర్భంగా మధురై జిల్లా అవనైపురంలో రాష్ట్ర సంప్రదాయ వేడుక జల్లికట్టును రాహుల్​ వీక్షిస్తారని తమిళనాడు కాంగ్రెస్​ అధ్యక్షుడు కేఎస్​ అళగిరి వెల్లడించారు. ఈ వేడుకకు భారీ స్థాయిలో ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ పర్యటనలో రాహుల్​ రైతులతో ముచ్చటించే అవకాశముంది.

ఆర్​ఎస్ఎస్​ చీఫ్​..

ఆర్​ఎస్​ఎస్ అధినేత మోహన్ భగవత్​ తమిళనాడులో రెండో రోజు పర్యటనలో ఉన్నారు. చెన్నైలోని మూలకడైలో నిర్వహించే సంక్రాంతి వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు.

ఇదీ చూడండి: సాగు చట్టాలపై సుప్రీం తీర్పును స్వాగతించిన కమల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.