ETV Bharat / bharat

ఇది హోటల్​ కాదు గురూ.. పోలీస్​స్టేషన్​ - బేకాల్​ పోలీస్​ స్టేషన్​

జీవితంలో ఎప్పుడూ పోలీస్​స్టేషన్​లో అడుగుపెట్టకూడదు అని చాలా మంది అనుకుంటారు. వెళ్లిన వారు అక్కడి మనుషులు, చుట్టుపక్కల వాతావరణం చూసి ఒకింత అసౌకర్యంగా భావిస్తారు. కానీ కేరళలో ఓ పోలీస్​స్టేషన్ మాత్రం ఇందుకు భిన్నం. ఈ ఠాణా.. ఐదు నక్షత్రాల హోటల్​ను తలపిస్తోందంటే నమ్ముతారా?

Police Station at Bekal, Kasaragod, looks like a five star hotel reception
ఇది హోటల్​ కాదు గురూ.. పోలీస్​స్టేషన్​
author img

By

Published : Nov 19, 2020, 12:43 PM IST

Updated : Nov 19, 2020, 2:23 PM IST

ఇది హోటల్​ కాదు గురూ.. పోలీస్​స్టేషన్​

కేరళ కాసరగోడ్​ జిల్లాలోని బేకాల్​ పోలీస్​స్టేషన్​ను చూస్తే ఎవరైనా లగ్జరీ హోటల్​ అనే భావిస్తారు. చూట్టూ పూల మొక్కలు, లోపలికి అడుగు పెట్టగానే అక్వేరియం, సేదతీరడానికి కుర్చీలు, సోఫాలు, ఇలా ఒకటేంటి అన్ని హైటెక్​ హంగులను తలపిస్తాయి. ​ఫిర్యాదు చేయాడానికి ఎవరైనా వస్తే ఓ క్షణం ఆగి ఎక్కడికి వచ్చామా? అని ఆలోచించుకోవాల్సిందే.

Police Station at Bekal, Kasaragod, looks like a five star hotel reception
స్టేషన్​ ముందు కొలువుతీరిన గాంధీజీ

పదిలక్షలు ఖర్చుపెట్టి...

హైటెక్​ సొగసులు

మొదట అన్ని స్టేషన్లులానే ఉండేది బేకాల్​ పోలీస్​స్టేషన్.​ ఈ విధంగా మారడానికి సుమారు రూ. 10లక్షలు ఖర్చు చేశారు. ప్రభుత్వం అందించే సాయంతో పాటు స్థానికులూ సహకారం అందించారు. కేవలం 21 రోజుల్లోనే సర్వాంగ సుందరంగా మారింది ఈ స్టేషన్​. కాసరగోడ్, కన్హంగాడ్లను కలిపే రాష్ట్ర రహదారిపై ఈ పోలీస్​ స్టేషన్ ఉంది. దీనికి అద్దిన రంగులతో సుందరంగా కనిపించడమే కాక.. రాత్రి సమయంలో కాంతులతో చూపరులను ఆకట్టుకుంటుంది.

రిసెప్షన్

ఇంటీరియర్​ అదరహో...

ఫిర్యాదుదారులు కూర్చోవడానికి సోఫాలు

ఈ స్టేషన్​లో ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఇంటీరియర్​ డిజైన్​. లోపలికి అడుగుపెట్టిన రిసెప్షన్​ దగ్గర నుంచి శౌచాలయాల వరకు అంతా హైటెక్​ హంగులతో దర్శనం ఇస్తాయి. ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారి కోసం సౌకర్యవంతమైన లాబీని రూపొందించారు. స్టేషన్​కు హై లుక్​ రావడం కోసం భవనం చుట్టూ ఇంటర్‌లాక్ టైల్స్ వేశారు.

ఇదీ చూడండి: 'ఛఠ్​​పూజ'లో ముస్లిం మహిళల పొయ్యిలే ప్రత్యేకం

Last Updated : Nov 19, 2020, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.