ETV Bharat / bharat

మతాంతర వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు - మతాంతర వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు

ఉత్తర్​ప్రదేశ్ లఖ్​నవూలో ఓ మతాంతర వివాహాన్ని అడ్డుకున్నారు పోలీసులు. లవ్ జిహాద్​ ఆర్డినెన్స్​ కింద ఫిర్యాదు అందటంతోనే ఈ మేరకు వివాహాన్ని నిలిపివేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే.. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరుగుతుండటం గమనార్హం. మరో ఘటనలో 14 మందిపై కేసు నమోదైంది.

Police stall interfaith marriage in Lucknow
'లవ్​ జిహాద్​' పెళ్లిని అడ్డుకున్న పోలీసులు!
author img

By

Published : Dec 4, 2020, 3:07 PM IST

Updated : Dec 4, 2020, 3:20 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో బలవంతపు మతమార్పిడిలకు వ్యతిరేకంగా యోగి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్​ కింద కేసులు పెరుగుతున్నాయి. తాజాగా లఖ్​నవూలో ఓ మతాంతర వివాహాన్ని అడ్డుకున్నారు పోలీసులు. అయితే.. ఇక్కడ వధూవరుల కుటుంబ సభ్యుల సమ్మతితోనే ఈ వివాహం జరుగుతుండటం గమనార్హం. దీంతో 'లవ్​ జిహాద్​' ఆర్డినెన్స్​పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

"వివాహం జరుగుతుందా? లేదా అనేది పోలీసులు నిర్ణయిస్తారు. ఇద్దరు మేజర్లు కలిసి జీవించేందుకు ఎవరూ అడ్డుచెప్పలేరని కోర్టులు చెబుతున్నాయి. కానీ, ఈ ఆర్డినెన్స్​ వల్ల పోలీసులు అడ్డుకునే పరిస్థితులు తలెత్తాయి." అని పేర్కొన్నారు పెళ్లికి హాజరైన మరూప్​ అలీ. అలాగే.. వధువు బంధువులు కూడా ఈ ఘటనపై అసహనం వ్యక్తం చేశారు. ఇరువురి కుటుంబాల సమ్మతితో, వారి సమక్షంలో జరుగుతోన్న పెళ్లిని పోలీసులు అడ్డుకోవటం గతంలో ఎక్కడా చూడలేదన్నారు. స్వతంత్ర భారతంలో ఇలాంటి ఘటన ఒకటి ఎదురవుతుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

హిందూ మహాసభ జిల్లా అధ్యక్షుడు బ్రిజేశ్​ శుక్లా.. ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టినట్లు సమాచారం. గత బుధవారం రాత్రి వివాహం జరుగుతోన్న ప్రదేశానికి పోలీసులు చేరుకుని అడ్డుకున్నారు. ఈ పెళ్లి ముందుగా హిందూ సంప్రదాయాల ప్రకారం నిర్వహించి.. తర్వాత ముస్లిం ఆచారాలతో చేపట్టేందుకు నిర్ణయించారని పోలీసులు తెలిపారు. ఇటీవల తీసుకొచ్చిన చట్టవిరుద్ధ మత మార్పిడిల నిరోధక ఆర్డినెన్స్​-2020లోని సెక్షన్​ 3, 8(క్లాజ్​ 2) ప్రకారం వివాహాన్ని అడ్డుకున్నట్లు చెప్పారు. అయితే.. ఈ సంఘటనపై ఎలాంటి ఎఫ్​ఐఆర్​ నమోదు చేయలేదని తెలుస్తోంది.

కోర్టు ప్రాంగణంలోనే దాడి

యోగి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్​లోకి మరో ఘటన చేరింది. చట్టపరంగా వివాహం చేసుకోవాలని అలీగఢ్​కు చెందిన ఓ ముస్లిం యువకుడు, మరోమతానికి చెందిన ఓ యువతిని తీసుకొని కోర్టుకు రాగా.. అక్కడే కొందరు దాడికి పాల్పడ్డారు. గురువారం జరిగిన ఈ సంఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. వీడియోలో.. యువకుడిని పలువురు పోలీసులు ఆటోరిక్షాలో తీసుకెళుతున్నట్లు కనిపిస్తోంది. మరో వీడియోలో యువతిని మహిళా కానిస్టేబుల్​ తీసుకెళుతుండగా..తాను మేజర్​ అని అతడితోనే కలిసి జీవించాలనుకుంటున్నట్లు సదరు యువతి వారిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇద్దరిది వేరు వేరు మతాలే కాదు, వేరు వేరు రాష్ట్రాలు కూడా. వారిని అలీగఢ్​లోని సివిల్​ లైన్​ పోలీస్​ స్టేషన్​కు తరలించినప్పటికీ.. ఎఫ్​ఐఆర్​ నమోదు చేయలేదు.

'లవ్​ జిహాద్​' కింద 14 మందిపై కేసు

ఉత్తర్​ప్రదేశ్​ మౌ జిల్లాలో లవ్​ జిహాద్​ ఆర్డినెన్స్​ కింద 14 మందిపై కేసు నమోదైంది. జిల్లాలోని మొల్నాగంజ్​ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు చిరాయ్యకోట్​ పోలీస్​ స్టేషన్​లో షబాబ్​ ఖాన్​ అకా రాహుల్​, ఆయన సన్నిహితులు 13 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మతం మార్చాలనే ఉద్దేశంతో నవంబర్​ 30న వివాహ వేదిక నుంచి ఖాన్​​, ఆయన అనుచరులు తన కూతురిని అపహరించారని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

ఇదీ చూడండి: యూపీలో 'లవ్​ జిహాద్​' మొదటి అరెస్టు

Last Updated : Dec 4, 2020, 3:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.