ETV Bharat / bharat

'మోదీ ప్రసంగం ఆయన ఆశయాలకు ప్రతిబింబం'

ఎర్రకోట వేదికగా జరిగిన 74వ స్వాతంత్ర్య వేడుకల్లో జాతినుద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగాన్ని ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు స్వాగతించారు. ఆత్మనిర్భర భారత్​ నిర్మాణానికి అవసరమైన స్ఫూర్తిని ప్రజల్లో నింపేలా ఉందని కొనియాడారు.

author img

By

Published : Aug 15, 2020, 12:58 PM IST

PM's I-Day speech reinforces resolve of self-reliant India: Rajnath Singh
'మోదీ ప్రసంగం ఆయన ఆశయాలను ప్రతిబింబిస్తోంది!'

74వ స్వాతంత్య్ర దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం అభినందనీయమన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. పంద్రాగస్టు వేడుకల్లో ప్రధాని హోదాలో వరుసగా 7వ సారి మోదీ ప్రసంగించడంపై ప్రత్యేక అభినందనలు తెలిపారు.

"మోదీ ప్రసంగాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సమగ్ర దూరదృష్టితో చేసిన ప్రసంగం దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకంగా ఉంది. కరోనా మహమ్మారితో దేశం సమష్టిగా పోరాడగలదని, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించగలదనే విశ్వాసం నింపేలా ఉంది ఆయన ప్రసంగం. మనం ఆత్మనిర్భర భారతాన్ని నిర్మించగలమని భరోసా ఇస్తోంది.

దీర్ఘకాలం ప్రధాని పదవిని చేపట్టిన 4వ వ్యక్తిగా మోదీ నిలిచినందుకు అభినందనలు. "

-వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి

రక్షణ మంత్రి

రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు ప్రముఖులు ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని కొనియాడారు. భారతదేశం అన్ని రంగాల్లోనూ స్వావలంబన సాధించడానికి ఆయన ప్రసంగం స్ఫూర్తినిస్తుందన్నారు.

ప్రధాని భారత్ దశాదిశలు మార్చే ప్రసంగం చేశారన్నారు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ తనదైన ముద్రను వేసేందుకు, ఆత్మనిర్భర్ భారత నిర్మాణానికి ప్రతి పౌరుడు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

"మోదీ ప్రసంగం భారత దేశ స్వాలంబన ఆకాంక్షను పటిష్ఠం చేస్తోంది. స్వాలంబన సాధించడంలో సవాళ్లు ఎదురవుతుండొచ్చు. కానీ, ఆ సవాళ్లను ఎదిరించే సత్తా కూడా మనకు ఉంది. ప్రపంచ సంక్షేమం కోసం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ తన ముద్ర వేసుకునేందుకు ప్రతి భారతీయుడు కృషి చేయాలి. కరోనా విపత్తును మనం ఓ అవకాశంగా మలచుకోవాలి. "

-రాజ్​నాథ్ సింగ్, రక్షణ మంత్రి

మోదీ ప్రకటించిన డిజిటల్ హెల్త్ మిషన్, డిజిటల్ ఐడీ వైద్య రంగంలోనే పెనుమార్పుకు శ్రీకారం చుడుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు రాజ్​నాథ్​.

173 సరిహద్దు, కోస్తా ప్రాంతాల్లో విధులు నిర్వహించేందుకు ఎన్ సీసీని విస్తరిస్తామన్న మోదీ ప్రకటనపై స్పందించారు రక్షణ మంత్రి. అందుకోసం తమ శాఖ పూర్తి సిద్ధంగా ఉందని.. త్వరలోనే లక్ష మంది కొత్త జవాన్లను ప్రత్యేక శిక్షణ విధుల్లోకి పంపిస్తామని వెల్లడించారు.

ఆశయాలకు ప్రతిబింబం

ప్రధాని ప్రసంగం ఆత్మ నిర్భర్ భారతాన్ని తయారు చేయాలన్న ఆయన ఆశయాలను ప్రతిబింబిస్తుందన్నారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.

ఇదీ చదవండి : 'వ్యవసాయమే 'ఆత్మనిర్భర్​ భారత్​' తొలి ప్రాధాన్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.