తమ ప్రభుత్వం ఎంఎస్పీని తొలగించాలనుకుంటే స్వామినాథన్ కమిషన్ సిఫారసులను ఎందుకు అమలు చేస్తుందని ప్రశ్నించారు ప్రధాని మోదీ. తమ సర్కారు ఎంఎస్పీ విషయంలో కచ్చితత్వంతో ఉన్నామన్నారు. అందకే ప్రతి ఏడాది సీజన్ ముందే మద్ధతు ధరను ప్రకటిస్తున్నట్లు చెప్పారు.
ఆందోళనలు చేస్తున్న పార్టీ నాయకత్వం ఎంత క్రూరమైనదో స్వామినాథన్ కమిషన్ నివేదికే అతిపెద్ద రుజువు అన్నారు ప్రధాని. గత ప్రభుత్వం స్వామినాథన్ సిఫారసులను సమర్పించాక ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఆ నివేదికలను చెత్తబుట్టలో వేసిందన్నారు.