ETV Bharat / bharat

లాక్​డౌన్ పొడిగింపుపై నేడు ప్రధాని కీలక ప్రకటన!

author img

By

Published : Apr 11, 2020, 5:44 AM IST

Updated : Apr 11, 2020, 8:28 AM IST

ఆంక్షలు పొడిగించాలని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతుండటం, ఇందుకు అఖిల పక్ష నేతల్లో మెజారిటీ సభ్యులు అంగీకరించడం వల్ల లాక్​డౌన్ కొనసాగింపు లాంఛనమే కానుంది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇవాళ జరగబోయే వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారని సమాచారం. అప్పుడే లాక్​డౌన్​ పొడిగింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

PM to interact with CMs on Saturday; extension of lockdown on agenda
లాక్​డౌన్ పొడిగింపుపై నేడు ప్రధాని కీలక ప్రకటన!

దేశంలో కరోనా నివారణకు కేంద్రం విధించిన గడువు మరో మూడు రోజుల్లో ముగియనుండగా.. లాక్​డౌన్​ పొడిగింపుపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని యావత్​ దేశం ఎదురు చూస్తోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకూ కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నందున మరో రెండువారాల పాటు లాక్​డౌన్​ పొడిగింపునకు సర్కారు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. ఒకవేళ లాక్​డౌన్​ కొనసాగిస్తే ఈసారి కొన్ని మినహాయింపులు ప్రకటిస్తారని తెలుస్తోంది.

ఎక్కువశాతం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆంక్షల పొడిగింపునకే మొగ్గుచూపుతున్నాయి. ఈనెల 30 వరకు లాక్​డౌన్​ను పెంచుతున్నట్లు ఒడిశా, పంజాబ్​ ముఖ్యమంత్రులు ఇప్పటికే ప్రకటించారు. ఆంక్షలు ఇంకొంతకాలం కొనసాగించాలని తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక సహా అనేక రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. తమిళనాడులోనూ నిపుణుల కమిటీ ఆంక్షలు కొనసాగించాలని ముఖ్యమంత్రికి సూచించింది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఇదే విషయంపై ఇప్పటికే.. అఖిలపక్ష నేతలతో చర్చించారు. ఇవాళ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ కానున్నారు. ఈ సమావేశంలోనే లాక్​డౌన్ కొనసాగింపుపై సీఎంలతో చర్చించి ప్రధాని నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మోదీ మరోసారి!

ముఖ్యమంత్రులతో భేటీ ముగిసిన అనంతరం ప్రధాని మరోసారి జాతినుద్దేశించి ప్రసంగిస్తారని సమాచారం. లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగిస్తారని ప్రభుత్వ వర్గాలు ఇప్పటికే పరోక్షంగా సూచనలు చేశాయి. అయితే ఈ సారి ఎన్నో మార్పులు చేస్తారని తెలుస్తోంది.

కొన్ని సడలింపులు..

నిత్యావసరాల రవాణా మినహాయించి రాష్ట్రాల మధ్య రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతాయి. పాఠశాలలు, కళాశాలలు, ఆధ్యాత్మిక కేంద్రాలు తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు మూసే ఉంచుతారు. లాక్‌డౌన్‌ ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ మందగించిన నేపథ్యంలో భౌతిక దూరాన్ని కఠినంగా అమలు చేస్తూ కొన్ని రంగాలకు సడలింపులు ఇచ్చే అవకాశం ఉంది.

శుక్రవారం అఖిల పక్ష నేతలతో మోదీ చర్చించిన నేపథ్యంలో 88 శాతం మంది నాయకులు లాక్​డౌన్ కొనసాగింపునకు మొగ్గు చూపినట్లు సమాచారం. మోదీ కూడా ఏప్రిల్ 14 తర్వాత.. పరిస్థితి తీవ్రత దృష్ట్యా లాక్​డౌన్ ఎత్తివేసే అవకాశం లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి : ప్రపంచవ్యాప్తంగా 'లక్ష' దాటిన కరోనా మరణాలు

Last Updated : Apr 11, 2020, 8:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.