ETV Bharat / bharat

'మోదీజీ... సరిహద్దు ఘర్షణపై మౌనం వీడండి'

author img

By

Published : Jun 17, 2020, 4:44 PM IST

చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరులైన జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు కాంగ్రెస్​ అధినేత్రి సోనియాగాంధీ. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించిన సోనియా.. సరిహద్దులపై ఇప్పటికైనా ప్రధాని మోదీ ప్రజల ముందు నిజానిజాలేంటో చెప్పాలని డిమాండ్​ చేశారు.

PM should tell nation how Chinese occupied Indian territory: Sonia Gandhi
సరిహద్దుల్లో ఘర్షణపై మోదీ నోరు విప్పాలి

గాల్వన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో భారత జవాన్ల వీరమరణం.. తీవ్ర మనోవేదనను కల్గించిందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. అమర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించిన ఆమె... వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో కాంగ్రెస్‌ పార్టీ... భారత సైన్యం, సైనికులు, ప్రభుత్వానికి మద్దతుగా ఉంటుందని స్పష్టంచేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజల ముందుకు వచ్చి నిజమేంటో చెప్పాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు.

"భారత్‌-చైనా సరిహద్దు ఘర్షణలో అమరులైన వీరజవాన్లకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ సమయంలో ప్రధాన మంత్రి దేశ ప్రజల ముందుకు వచ్చి నిజమేంటో చెప్పాల్సిన అవసరం ఉంది. మన భూభాగాలను చైనా ఏ విధంగా ఆక్రమించింది? 20 మంది సైనికులు ఎందుకు అమరులయ్యారు? సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఇప్పటికీ మన సైన్యాధికారులు, సైనికుల ఆచూకీ లభించాల్సి ఉందా? ఎంత మంది అధికారులు, జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు? మన భూభాగంలో చైనా ఏఏ ప్రాంతాలను ఆక్రమించింది? ఈ పరిస్థితిపై భారత సర్కారు విధానాలేంటి? ఈ సంకట పరిస్థితుల్లో సైనికులు, సైన్యం, భారత సర్కారుకు కాంగ్రెస్‌ పార్టీ మద్దతుగా ఉంటుంది."

- సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు

ఇదీ చదవండి: గురువారం మాస్క్ డే- కరోనాపై అవగాహనే లక్ష్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.