ETV Bharat / bharat

ప్రభుత్వ పాలనలో మోదీ 'రూటే.. సెపరేటు': నఖ్వీ - ప్రధాని మోదీ పాలన నఖ్వీ

గత ప్రభుత్వాలు- ప్రధాని మోదీ పాలన మధ్య చాలా వ్యత్యాసం ఉందని మైనారిటీ వ్యవహారాలశాఖ మంత్రి ముఖ్తార్​ అబ్బాస్​ నఖ్వీ అన్నారు. అధికారులకు తమ పనితీరుపైనే ఉద్యోగం ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని మోదీ తేల్చిచెప్పినట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్​ను పరోక్షంగా విమర్శిస్తూ.. ఓ వ్యాసాన్ని రాసుకొచ్చారు.

PM removed 'feudal' customs, 'red beacon culture' in governance: Naqvi
'పాలనలో ప్రధాని మోదీ 'రూటే.. సపరేటు''
author img

By

Published : Sep 18, 2020, 12:54 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనపై కేంద్ర మైనారిటీ వ్యవహారాలశాఖ మంత్రి ముఖ్తార్​ అబ్బాస్​ నఖ్వీ ప్రశంసల వర్షం కురిపించారు. గత ప్రభుత్వాల పాలనలోని లోపాలను వెలికితీసి.. తనదైన శైలిలో మోదీ పరిష్కరించారన్నారు. వ్యవస్థలన్నిటి నుంచి మెరుగైన పనితీరును రాబట్టే విధంగా అనేక చర్యలు చేపట్టారన్నారు.

'పాత పద్ధతులకు చెక్​...'

'కల్చర్​ ఆఫ్​ పరిక్రమ రిప్లేస్డ్​ బై కమిట్​మెంట్​ ఆఫ్​ పర్​ఫార్మెన్స్​' అనే శీర్షికతో ఓ వ్యాసాన్ని రాసుకొచ్చారు నఖ్వీ. దేశాన్ని పాలించే విధానంలో ప్రధాని మోదీ శైలిని ప్రస్తావించారు. గత ప్రభుత్వాలకు- మోదీ పాలనకు మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నారు.

కాంగ్రెస్​పైనా పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు నఖ్వీ. ఎన్నో ఏళ్లుగా.. అధికారులు ప్రజలను తమ చుట్టూ తిప్పుకునే వారని ఆరోపించారు. వాటన్నిటికీ మోదీ ప్రభుత్వం చెక్​ పెట్టిందని స్పష్టం చేశారు. పనితీరుపైనే ఉద్యోగం ఆధారపడి ఉంటుందని రుజువు చేశారని ప్రశంసించారు.

"2014కు ముందు... విమానాశ్రయాల్లో ప్రధానిని ఆహ్వానించడం లేదా వీడ్కోలు చెప్పడం కేబినెట్​ మంత్రులకు ఆచారంగా ఉండేది. ఈ భూస్వామ్య ఆచారాలను మోదీ తునాతునకలు చేశారు. అదే విధంగా.. అధికారంలో ఉండే వారు తమని తాము గొప్పగా చెప్పుకునే వారు. తమ అధికారాన్ని,హోదాను ప్రదర్శించుకునే వారు. వీటన్నిటికీ మోదీ స్వస్తి పలికారు."

--- ముఖ్తార్​ అబ్బాస్​ నఖ్వీ, కేంద్రమంత్రి

విదేశీ పర్యటనలపైనా మోదీ ప్రభుత్వ వైఖరిని ప్రశంసించారు కేంద్రమంత్రి. నేతల విదేశీ పర్యటనలో ఉండే 'ఒక రోజు పని- 10 రోజుల విహారయాత్ర' ఆచారాన్ని మోదీ తీవ్రంగా వ్యతిరేకించారని పేర్కొన్నారు. వారి పర్యటనలన్నీ సత్ఫలితాలనిచ్చే విధంగానే ఉండాలని మోదీ తేల్చిచెప్పిన్నట్టు వివరించారు.

ఇదీ చూడండి:- 'మోదీజీ.. ఆ 'గౌరవం' ప్రజలకు దక్కనివ్వరా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.