భాజపా అగ్రనేత ఎల్కే అడ్వాణీ నివాసానికి ప్రధాని నరేంద్రమోదీ ఈ ఉదయం వెళ్లారు. అడ్వాణీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భాజపా అధ్యక్షుడు అమిత్‌షా, కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖులు ప్రధాని వెంట ఉన్నారు. ప్రధాని బృందం అడ్వాణీ నివాసంలో ఉండగానే ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అక్కడికి చేరుకున్నారు.
అడ్వాణీకి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన వెంకయ్య.. ప్రధాని మోదీ బృందంతో కాసేపు ముచ్చటించారు. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్విట్టర్ ద్వారా అడ్వాణీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన శేష జీవితం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.