ETV Bharat / bharat

'కశ్మీర్​లో ఏం జరుగుతోంది.. ప్రధానే చెప్పాలి' - congress

జమ్ముకశ్మీర్​లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ తెలిపారు. అక్కడ ఏం జరుగుతుందో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

'కశ్మీర్​లో ఏం జరుగుతోంది? ప్రధానే చెప్పాలి'
author img

By

Published : Aug 11, 2019, 5:23 AM IST

Updated : Aug 11, 2019, 11:21 AM IST

'కశ్మీర్​లో ఏం జరుగుతోంది? ప్రధానే చెప్పాలి'

జమ్ముకశ్మీర్‌లో ఏం జరుగుతుందో ప్రధాని.. ప్రజలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ డిమాండ్‌ చేశారు. శనివారం రాత్రి సీడబ్ల్యూసీ భేటీ సందర్భంగా రాహుల్‌ మీడియాతో మాట్లాడారు. జమ్ముకశ్మీర్‌ ప్రజలు చాలా ఆందోళనగా ఉన్నట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడి ఎంపిక అంశాన్ని కాసేపు పక్కనపెట్టి జమ్ముకశ్మీర్‌ అంశంపైనే ప్రధానంగా చర్చించినట్లు చెప్పారు.

"కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ జరుగుతుండగానే.. జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు బాగాలేవన్న నివేదికలు అందాయి. అక్కడ హింస చెలరేగుతోందని, ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని.. మా దృష్టికి వచ్చింది. జమ్ముకశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏం జరుగుతోందో చెప్పే విషయంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి పారదర్శకంగా వ్యవహరించాలి"

-రాహుల్​ గాంధీ

శనివారం రాత్రి రెండోసారి సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్‌ అధ్యక్షుడి ఎంపికపై చర్చించాలని కమిటీ సభ్యులకు సూచించి... సోనియాగాంధీ, రాహుల్‌ బయటకు వచ్చారు. ఆ తర్వాత సీడబ్ల్యూసీలో జమ్ముకశ్మీర్‌ అంశంపై చర్చకు రావాలని సభ్యులు కోరిన అనంతరం రాహుల్‌ మళ్లీ సమావేశానికి హాజరయ్యారు. ఇదే సమావేశంలో కశ్మీర్​ ఆందోళనకర పరిస్థితుల అంశంపై తీర్మానాన్ని ఆమోదించింది సీడబ్ల్యూసీ కమిటీ.

AP Video Delivery Log - 1600 GMT News
Saturday, 10 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1539: Kashmir India Protest AP Clients Only 4224535
Protests held in Srinagar after Friday prayers
AP-APTN-1530: Archive US Epstein 2 Part must credit Florida Department of Law Enforcement/Part must credit New York State Sex Offender Registry /Part must credit Aggie Kenny 4224534
Jeffrey Epstein dies by suicide in New York prison
AP-APTN-1433: Italy Open Arms Gere AP Clients Only 4224532
Actor highlights plight of Europe-bound migrants
AP-APTN-1419: Archive US Epstein Part Must credit New York State Sex Offender Registry" / Part Must Credit Elizabeth Williams / Part Must Credit Aggie Kenny 4224530
Jeffrey Epstein found dead in US prison cell
AP-APTN-1407: Russia Protest AP Clients Only 4224531
Tens of thousands join Russia opposition protest
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Aug 11, 2019, 11:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.