ETV Bharat / bharat

'మోదీజీ.. కరోనా కట్టడి వ్యూహాలు ఏంటి?' - Randeep Surjewala

భారత్​లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రంపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా. కరోనా కట్టడిలో ప్రధాని మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కరోనాను ఎదుర్కొనేందుకు ఎలాంటి ప్రణాళికలను అవలంబిస్తారో ప్రజలకు తెలపాలని డిమండ్​ చేశారు.

PM must answer on govt strategy to control spread of COVID-19: Cong
'మోదీజీ.. కరోనా కట్టడి వ్యూహాలు వివరించండి'
author img

By

Published : Sep 7, 2020, 5:42 PM IST

దేశవ్యాప్తంగా ఒక్కరోజులో రికార్డు స్థాయిలో 90వేలకుపైగా కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో.. మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్​ విరుచుకుపడింది. కరోనా కట్టడిలో కేంద్రం పూర్తిగా విఫలమైందని మండిపడింది. భవిష్యత్తు ప్రణాళికలపై ప్రజలకు మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్​ చేసింది.

ప్రస్తుత పరిస్థితులకు.. ప్రభుత్వ ఉదాసీనత, అసమర్థతే కారణమని మండిపడ్డారు కాంగ్రెస్ అధికార​ ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా. నిపుణులు, కాంగ్రెస్​ హెచ్చరించినప్పటికీ.. మహమ్మారిని నియంత్రించేందుకు 'టెస్ట్​-ట్రేస్​-ఐసొలేట్​- ట్రీట్​' విధానాన్ని కేంద్రం అవలంబించలేదని దుయ్యబట్టారు. పరీక్షలు పెంచాల్సిన సమయంలో పట్టించుకోలేదని.. లాక్​డౌన్​ కాలంలో ట్రేసింగ్​ కోసం సరైన చర్యలు చేపట్టలేదని ఆరోపించారు.

"కరోనా సంక్షోభంతో ముందుకు సాగేందుకు రచించిన వ్యూహాలను ప్రధాని మోదీ ప్రజలకు వివరించాలి. తన విఫల నాయకత్వంపై ప్రజలకు మోదీ సమధానమిస్తారా? ప్రమాదకర రీతిలో విజృంభిస్తున్న కరోనాను ప్రభుత్వం ఎలా అడ్డుకుంటుంది?"

--- రణ్​దీప్​ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార​ ప్రతినిధి.

ఇదీ చూడండి:- 'సరిహద్దు చర్చల వివరాలను ప్రజలతో పంచుకోరా?'

దేశంలో కరోనా రెండో రౌండ్​ మొదలైందని కొందరు నిపుణులు చెబుతున్నారని.. అదే సమయంలో సామాజిక వ్యాప్తి కూడా ప్రారంభమైందని మరికొందరు విశ్లేషిస్తున్నారని సుర్జేవాలా గుర్తుచేశారు. అయితే ఇవేవీ మోదీ ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు.

ఆర్థిక పరిస్థితినీ ప్రస్తావించారు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి. "ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు మోదీ ప్రభుత్వం వద్ద ఏవైనా ప్రణాళికలున్నాయా? లేదా ఇది కూడా దైవమే చేసిందని ఆరోపిస్తారా?" అని ఎద్దేవా చేశారు.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.