ETV Bharat / bharat

'కరోనా కట్టడికి నిర్ధరణ పరీక్షలు పెంచడమే మార్గం' - PM MODI CORONA VIRUS

కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి వైరస్ నిర్ధరణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచడమే మార్గమని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ అభిప్రాయపడ్డారు. రోజుకు లక్షకుపైగా పరీక్షలు నిర్వహించాలని ప్రధానిని కోరారు రాహుల్​.

PM must act fast and clear bottlenecks to scale up COVID-19 testing: Rahul
'మోదీజీ.. ఆ అడ్డంకులను తొలగిస్తేనే వైరస్​ కట్టడి'
author img

By

Published : Apr 26, 2020, 5:07 PM IST

దేశంలో కరోనా మహమ్మారి​ విస్తరిస్తున్న నేపథ్యంలో వైరస్​ను గుర్తించేందుకు​ పరీక్షల సామర్థ్యాన్ని పెంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ సూచించారు. దేశంలో ప్రస్తుతం రోజుకు 40వేల వరకు కరోనా టెస్టులు మాత్రమే జరుగుతున్నాయని, ఆ సంఖ్యను లక్షకు పెంచాలన్నారు.

"భారీ సంఖ్యలో నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తేనే వైరస్​ను కట్టడి చేయగలమని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని అవరోధాల వల్ల కిట్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. రోజుకు లక్షకు బదులు కేవలం 40వేల పరీక్షలే జరుగుతున్నాయి. ప్రధాని వేగంగా చర్యలు చేపట్టి అడ్డంకులను తొలగించి.. పరీక్షల సామర్థ్యాన్ని పెంచాలి. "

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

'జవాబుదారీతనం లేదు '

ప్రధాని మోదీ పాలనలో జవాబుదారీతనం లేకుండా పోయిందని సీపీఐ(ఎం​) ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి మండిపడ్డారు. ఇతర దేశాల్లో ప్రభుత్వంలోని ప్రధాన నేతలు మీడియా ముందుకు వచ్చి కరోనాపై తాజా పరిస్థితులను వివరిస్తున్నారని.. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తున్నారని గుర్తు చేశారు. కానీ భారత్​లో అలాంటి పరిస్థితి లేదన్నారు.

"ఇతర దేశాల్లో నేతలు రోజు మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. సమాధానాలకు జవాబు చెబుతున్నారు. జవాబుదారీగా ఉంటూ, వైరస్​ను కట్టడి చేయడంలో దేశం మెరుగైన స్థానంలో ఉందని చెప్పడానికి ఇదే మార్గం. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​ రోజు మీడియా సమావేశం నిర్వహిస్తారు. కరోనా కట్టడికి చేపట్టిన చర్యలను వివరిస్తారు. కానీ ప్రధాని మోదీ అలా చేయడం లేదు."

- సీతారాం ఏచూరి​, సీపీఎం ప్రధాన కార్యదర్శి

ఆకస్మికంగా చేసిన లాక్​డౌన్​ ప్రకటనతో దేశ ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఏచూరి ఆరోపించారు. లాక్​డౌ​న్​ పరిణామాలను భవిష్యత్​లో ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధం కాలేదన్నారు.

ఇదీ చూడండి:- 'కరోనా టెస్టుల్లో దూకుడేది? ఇలా అయితే కష్టమే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.