దేశవ్యాప్తంగా హోలీ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. ఒకరిపై ఒకరు రంగులు, పూలు జల్లుకుంటూ ఆనంద డోలికల్లో మునిగితేలుతున్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ.
"దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు. హోలీ అనేది ఐక్యతకు ప్రతీకలాంటింది. ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, ఆనందం వెల్లివిరియాలని ఆశిస్తున్నా."
-రామ్నాథ్ కోవింద్, రాష్ట్రపతి
హోలీ పండగ దేశ సామరస్యాన్ని చాటుతుందన్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ప్రతి ఒక్కరూ స్నేహభావంతో మెలగడానికి ఈ వేడుక ఎంతగానో దోహదపడుతుందన్నారు.
"హోలీ స్నేహభావాన్ని బలోపేతం చేస్తోంది. ఈ పండగ అడ్డుగోడలను తొలగిస్తుంది. అందరూ శాంతి, ఆనందం, సామరస్యంతో మెలగాలని ఆశిస్తున్నాను."
వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి.
దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ... ప్రజలందరీ జీవితాల్లో ఈ పండగ సుఖ సంతోషాలను తీసుకురావాలని ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి:కరోనా: ఇరాన్ నుంచి స్వదేశానికి 58 మంది