ప్రధాని నరేంద్రమోదీతో పాటు కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ లోక్‌సభ పక్షనేత అధీర్ రంజన్ చౌదరి. అబద్ధాలతోనే రెండు సార్లు అధికారంలోకి వచ్చారని విమర్శించారు. లోక్‌సభలో రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంపై చర్చలో భాజపా తీరుపై మండిపడ్డారు అధీర్.
"మోదీ మొదటి ఐదేళ్లు.. ఇప్పుడు మరో ఏడాది. మొత్తం ఆరేళ్లు. 2-జీ కుంభకోణంలో ఎవరినైనా అరెస్ట్ చేశారా? రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను జైలుకు ఎందుకు పంపలేదు? ఎవరినైతే దొంగలని చెబుతూ మీరు అధికారంలోకి వచ్చారో వాళ్లు ఇప్పుడు సభలో ఎందుకున్నారు? జైలులో ఎందుకు లేరు? ఇక ఈ ఉత్పత్తులు అమ్ముడుపోవు. ఈ సారి మీరు మరో కొత్త ఉత్పత్తిని తీసుకొస్తారు. ఎందుకంటే ప్రధానమంత్రి ఓ పెద్ద సేల్స్‌మన్. మా ఉత్పత్తులను మేం అమ్ముకోలేకనే ఎన్నికల్లో ఓడిపోయాం."
- అధీర్ రంజన్ చౌదరి, కాంగ్రెస్ పక్షనేత
ఇదీ చూడండి: కార్గిల్, బాలాకోట్‌పై ధనోవా చెప్పిన ఆసక్తికర విషయాలు