రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రేపు రష్యాకు బయలుదేరనున్నారు. ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ద్వైపాక్షిక సదస్సు నిర్వహించనున్నారు మోదీ. అనంతరం వ్లాదివోస్తోక్లో జరగనున్న తూర్పు ఆర్థిక సదస్సులో పాల్గొననున్నారు. ఈ మేరకు ప్రధాని పర్యటన వివరాలను విదేశాంగశాఖ ప్రకటించింది.
బుధవారం వ్లాదివోస్తోక్‌కు చేరుకున్న అనంతరం.. పుతిన్‌తో కలిసి నౌకా నిర్మాణ కేంద్రాన్ని సందర్శిస్తారు మోదీ. అక్కడే జూడో ఛాంపియన్‌షిప్‌నకు వీరిరువురూ హాజరవుతారు. ఆ తర్వాత అగ్రనేతలు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. గురువారం రోజు ఆర్థిక సదస్సులో పాల్గొంటారు ప్రధాని.
ఇదీ చూడండి:- మోదీకి 'గేట్స్' పురస్కారం తెచ్చిన స్వచ్ఛ భారత్