'నమామి గంగా' మిషన్‌లో భాగంగా.. ఉత్తరాఖండ్‌లో గంగా జలాలను శుద్ధి చేసేందుకు నిర్మించిన ఆరు మెగా ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుందని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది.
హరిద్వార్‌లోని జగ్జీత్పుర్లో ఇటీవలే 68 ఎమ్ఎల్డీ ఎస్టీపీ(సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్) ప్రాజెక్టును నిర్మించారు. అదే ప్రాంతంలోని 27 ఎమ్ఎల్డీ సామర్థ్యం ఉన్న మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని ఆధునికీకరించారు. ఈ ప్రాజెక్టులతో పాటు మరో నాలుగింటిని ఉదయం 11గంటలకు మోదీ ప్రారంభించనున్నారు.
గంగా అవలోకన్...
గంగా నది ప్రాముఖ్యతను చాటిచెప్పే విధంగా నిర్మించిన తొలి మ్యూజియం 'గంగా అవలోకన్'ను ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. సంస్కృతి, జీవవైవిధ్యం, నది కార్యకలాపాలకు అద్ధం పట్టేలా.. హరిద్వార్ ఛండీ ఘాట్ వద్ద ఈ గంగా అవలోకన్ను ఏర్పాటు చేశారు. అదే సమయంలో 'రోవింగ్ డౌన్ ది గాంగెస్' పుస్తకాన్ని కూడా మోదీ ఆవిష్కరించనున్నట్టు ప్రధాని కార్యాలయం స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:- 'ఒకే దేశంపై ఆధారపడటం చాలా ప్రమాదం'