ETV Bharat / bharat

17వ భారత్​-ఆసియాన్​ సదస్సులో పాల్గొననున్న మోదీ

author img

By

Published : Nov 12, 2020, 5:20 AM IST

భారత్-ఆసియాన్​ 17వ శిఖరాగ్ర సదస్సు గురువారం ప్రారంభం కానుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్న ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. భారత్​-చైనా ఉద్రిక్తతలు, సరిహద్దు దేశాలతో డ్రాగన్ దుందుడుకు చర్యల నేపథ్యంలో ఈ సమావేశం కీలకం కానుంది.

PM Modi to co-chair virtual India-ASEAN summit on Thursday
17వ భారత్​-ఆసియన్ సదస్సులో పాల్గొననున్న మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ 17వ భారత్​-ఆసియాన్ సదస్సులో పాల్గొననున్నారు. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా దృష్ట్యా కార్యక్రమాన్ని వర్చ్యువల్​ పద్ధతిలో నిర్వహించనున్నారు. కొవిడ్​-19 కారణంగా దెబ్బతిన్న ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టే దిశగా చర్చలు జరపనున్నారు. దీంతో పాటు వాణిజ్యం, తీరప్రాంతాలు, విద్య, ఉపాధి తదితర అంశాలపై చర్చించనున్నారు.

"భారత్​-ఆసియాన్ సంబంధాలను బలోపేతం చేసే దిశగా దేశాధినేతలు చర్చలు జరపనున్నారు. భారత్​-ఆసియాన్​ (2021-2025) కార్యచరణ ప్రణాళికను రూపొందించనున్నారు. భారత్ యాక్ట్​ ఈస్ట్​ పాలసీతోపాటు, సభ్యత్వ దేశాల భౌగోళిక,చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలు చేపట్టనున్నారు."

-- భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.

దక్షిణ చైనా సముద్రం, సరిహద్దు వివాదాలు,తదితర అంశాల్లో చైనా వ్యవహరిస్తున్న తీరు దృష్ట్యా ఈ సమావేశం కీలకం కానుంది.

సభ్యత్వ దేశాలివే

మొత్తం 10దేశాలు ఈ కూటమిలో ఉన్నాయి. ఇండోనేసియా, ఫిలిప్పీన్స్​, సింగపూర్​, థాయి​లాండ్​, బ్రూనై, వియత్నాం, లావోస్​, మయన్మార్​, కాంబోడియా. భారత్​, చైనా, అమెరికా, జపాన్​, ఆస్ట్రేలియా దేశాలు పార్ట్నర్​ దేశాలుగా ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.