ETV Bharat / bharat

జీ-20 సదస్సుకు ప్రధాని, సురేష్​ప్రభు

ప్రధాని నరేంద్రమోదీ జపాన్​లో జరిగే జీ-20 సదస్సులో పాల్గొంటారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. ఆయనతో పాటు కేంద్రమంత్రి సురేశ్​ ప్రభు కూడా హాజరుకానున్నారు

జీ-20 సదస్సుకు ప్రధాని, సురేష్​ప్రభు
author img

By

Published : Jun 21, 2019, 5:35 PM IST

జపాన్​ ఒసాకాలో ఈ నెల 27, 29 తేదీల్లో జరిగే జీ-20 సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొంటారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది.

ప్రధానితో పాటు కేంద్రమంత్రి సురేశ్​ ప్రభు కూడా ఈ సదస్సులో పాల్గొంటారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రవీశ్​ కుమార్ తెలిపారు.

" జీ-20 సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొనడం ఇది ఆరోసారి. ఈ సదస్సులో ఆయన వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు."- రవీశ్​కుమార్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి

జీ-20 సభ్యదేశాలు

జీ-20లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్​, కెనడా, చైనా, యూరోపియన్ యూనియన్ దేశాలు, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, యూకే, అమెరికా సభ్య దేశాలు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థల స్థూల ఉత్పత్తిలో జీ-20 దేశాల వాటా 90 శాతం. ప్రపంచ వాణిజ్యంలో 80 శాతం, ప్రపంచంలో మూడో వంతు జనాభా ఉంది. సుమారుగా భూగోళంలో సగ భాగం ఆక్రమించి ఉన్నాయి.

ఇదీ చూడండి: సర్వం 'యోగా'మయం: ఘనంగా

Intro:Body:

SD

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.