ప్రపంచవ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే 15 లక్షలమందికి పైగా ఈ మహమ్మారి బారినపడ్డారు. ఈ వైరస్‌ను నియంత్రించేందుకు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ ద్వారా చర్చించారు. ఇరు దేశాలు పరస్పర సహకారంతో సాంకేతికతను వినియోగించి వైరస్‌ను అంతమొందించాలని ఆకాంక్షించారు.
వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు భారతీయ కంపెనీలు అందిస్తోన్న వైద్య పరికరాల సరఫరా, రవాణాను సులభతరం చేసినందుకు దక్షిణ కొరియా ప్రభుత్వానికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
కరోనాపై పోరులో దేశమంతా ఎకతాటిపైకి వచ్చేలా ప్రజలను ప్రోత్సహించిన భారతీయ అధికారుల పనితీరును మూన్ జే ప్రశంసించారు. ఇరుదేశాలకు చెందిన నిపుణులు కలిసి చర్చించి అనుభవాలను పంచుకుంటారని పేర్కొన్నారు. భారత్‌లో కొరియా పౌరులకు అందిస్తోన్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. గతేడాది కొరియా పర్యటనను మోదీ గుర్తు చేసుకుంటూ.. ఇరు దేశాల మధ్య సత్సంబంధాల మెరుగుదలపై సంతృప్తి వ్యక్తం చేశారు.