బిష్కెక్లో షాంఘై సహకార సంస్థ సదస్సుకు హాజరైన చైనా, భారత్ దేశాధినేతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి చేయాలని ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ నిర్ణయించారు.
ప్రధానిగా మోదీ తిరిగి ఎన్నికైన తర్వాత మొదటిసారిగా జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు.
-
Building on the momentum of high-level exchanges, PM @narendramodi had a warm meeting with Chinese President Xi Jinping. Leaders discussed all aspects of enriching our bilateral relations & recognised the positive role of strategic communication in deepening our partnership. pic.twitter.com/l4OYqLSvmy
— Raveesh Kumar (@MEAIndia) June 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Building on the momentum of high-level exchanges, PM @narendramodi had a warm meeting with Chinese President Xi Jinping. Leaders discussed all aspects of enriching our bilateral relations & recognised the positive role of strategic communication in deepening our partnership. pic.twitter.com/l4OYqLSvmy
— Raveesh Kumar (@MEAIndia) June 13, 2019Building on the momentum of high-level exchanges, PM @narendramodi had a warm meeting with Chinese President Xi Jinping. Leaders discussed all aspects of enriching our bilateral relations & recognised the positive role of strategic communication in deepening our partnership. pic.twitter.com/l4OYqLSvmy
— Raveesh Kumar (@MEAIndia) June 13, 2019
"చైనాతో స్నేహబంధం మరింత బలోపేతం అవుతోంది. ఎస్సీఓ సదస్సులో భాగంగా ప్రథమంగా జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు ప్రధాని నరేంద్రమోదీ. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేత మార్గాలపై ఇద్దరు నేతలు చర్చించారు."
-రవీశ్ కుమార్, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి
ఇదే వేదికపై పాకిస్థాన్ విషయంపైనా ఇరు నేతలు సుదీర్ఘంగా చర్చించినట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే తెలిపారు.
"పాకిస్థాన్‌పై ఇద్దరు నేతలు స్థూలంగా చర్చించారు. పాకిస్థాన్‌పై స్థిర వైఖరితో ఉన్నట్టు జిన్‌పింగ్‌కు ప్రధాని స్పష్టం చేశారు. మేం శాంతియుత ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలనుకున్నామని తెలిపారు. ఈ విషయమై ప్రయత్నాలు చేసినా ఫలించలేదన్నారు. ఉగ్రవాద రహిత పరిస్థితులు ఏర్పడేలా పాకిస్థాన్ కృషి చేయాల్సి ఉందనీ, కానీ అది ఎక్కడా కనిపించటం లేదని ప్రధాని ఆక్షేపించారు. ఈ విషయంలో పాకిస్థాన్ కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందని ఉద్ఘాటించారు."
-విజయ్ గోఖలే, విదేశాంగ శాఖ కార్యదర్శి
చైనా ప్రతిపాదనలు
వాణిజ్య యుద్ధం నేపథ్యంలో అమెరికాకు వ్యతిరేకంగా ఐక్య కూటమిని ఏర్పాటు చేయాలని జిన్‌పింగ్ సూచన చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలపై పోరాడాలన్నారు. భారత్‌కు అత్యంత ప్రీతిపాత్రమైన దేశం హోదాను అమెరికా రద్దు చేసిన కారణంగా వారికి సహకరిస్తామని చైనా భావిస్తోంది.
ఇదీ చూడండి: బిష్కెక్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ