బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారోతో భేటీ అయ్యారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. భారత్-బ్రెజిల్ ద్వైపాక్షిక సంబంధాలపై బ్రిక్స్ 11వ శిఖరాగ్ర సదస్సు వేదికగా చర్చించారు. వచ్చే ఏడాది జరగనున్న గణతంత్ర వేడుకలకు బొల్సొనారోను ఆహ్వానించారు. ఇందుకు బ్రెజిల్ అధ్యక్షుడు అంగీకరించారు.
'బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారోతో ఫలవంతమైన భేటీ జరిగింది.. ప్రజలకు మేలు చేకూర్చే దిశగా చర్చించా'మని ట్విట్టర్లో పోస్ట్ చేశారు మోదీ.
-
Met President @jairbolsonaro on the sidelines of the BRICS Summit in Brazil. Grateful to him and the people of Brazil for hosting the Summit.
— Narendra Modi (@narendramodi) November 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
During our talks today, we discussed furthering cooperation in areas pertaining to the economy, connectivity and people-to-people ties. pic.twitter.com/MzjVRgvB6j
">Met President @jairbolsonaro on the sidelines of the BRICS Summit in Brazil. Grateful to him and the people of Brazil for hosting the Summit.
— Narendra Modi (@narendramodi) November 13, 2019
During our talks today, we discussed furthering cooperation in areas pertaining to the economy, connectivity and people-to-people ties. pic.twitter.com/MzjVRgvB6jMet President @jairbolsonaro on the sidelines of the BRICS Summit in Brazil. Grateful to him and the people of Brazil for hosting the Summit.
— Narendra Modi (@narendramodi) November 13, 2019
During our talks today, we discussed furthering cooperation in areas pertaining to the economy, connectivity and people-to-people ties. pic.twitter.com/MzjVRgvB6j
వ్యవసాయ పరికరాలు, పశుపోషణ, పంటకోత సాంకేతికత, బయో ఇంధన రంగాల్లో భారత్‌లో పెట్టుబడికై బ్రెజిల్‌కు ఆహ్వానం పలికారు మోదీ. భారత పర్యటకులకు వీసా రహిత సందర్శనకు అవకాశం కల్పించడాన్ని స్వాగతించారు.
'వ్యాపారులతో వస్తా'
భారత సందర్శనకు వ్యాపార ప్రతినిధి బృందంతో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో. అంతరిక్షం, రక్షణ రంగాల్లో పరస్పర సహకారం దిశగా ఇరుదేశాలు ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.
ఇదీ చూడండి: చంద్రయాన్-2: టీఎంసీ-2 చిత్రించిన బిలం 3డీ వ్యూ