ETV Bharat / bharat

ప్రధాని మోదీ అయోధ్య పర్యటన సాగిందిలా... - అయోధ్య భూమి పూజ లైవ్

అయోధ్య నగరంలో రామ మందిరాన్ని నిర్మించేందుకు ఆగస్టు 5న(నేడు) అంకురార్పణ జరిగింది. రాముడి జన్మస్థలమైన అయోధ్యలో.. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మధ్యాహ్నం ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కొవిడ్‌ నేపథ్యంలో కొద్దిమంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భారతీయులు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించారు.

ayodhya latest news 2020
ప్రధాని మోదీ అయోధ్య పర్యటన సాగిందిలా...
author img

By

Published : Aug 5, 2020, 5:52 PM IST

అయోధ్యలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా రామమందిర నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఆగమ పండితులు ప్రధాని చేతుల మీదుగా ఈ క్రతువు నిర్వహించారు.

ayodhya latest news 2020
పూజా కార్యక్రమంలో మోదీ
ayodhya latest news 2020
భూమి పూజలో మోదీ

29 ఏళ్లకు మళ్లీ అయోధ్యకు...

ayodhya latest news 2020
హెలికాప్టర్​లో అయోధ్యకు మోదీ

భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ.. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో లఖ్‌నవూ చేరుకున్నారు. అక్కడి నుంచి వాయుసేన హెలికాప్టర్‌లో అయోధ్యకు విచ్చేశారు. హెలీప్యాడ్‌ వద్ద యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, పలువురు ఉన్నతాధికారులు ప్రధానికి స్వాగతం పలికారు. 1991 తర్వాత దాదాపు 29 ఏళ్లకు మోదీ మళ్లీ అయోధ్యలో కాలుమోపారు.

హనుమాన్​ ఆలయంలో పూజలు...

ayodhya latest news 2020
అయోధ్య భూమి పూజ కార్యక్రమంలో మోదీ
ayodhya latest news 2020
భూమిపూజ కార్యక్రమంలో మోదీ

హెలిప్యాడ్‌ నుంచి నేరుగా అయోధ్యలోని 10వ శతాబ్దం నాటి హనుమాన్​గఢీ ఆలయానికి చేరుకున్నారు ప్రధాని. అనంతరం ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​తో కలిసి అంజన్నను దర్శించుకున్నారు.

ayodhya latest news 2020
ప్రధాని మోదీ

హనుమాన్​గఢీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ గడ్డిన్​షీన్​ ప్రేమదాస్​ మహారాజ్​ మోదీకి తలపాగా, వెండి ముకుటం,శాలువా ఇచ్చి, ఆశీర్వదించారు.

ayodhya latest news 2020
రాముడి విగ్రహాంతో మోదీ, యోగి ఆదిత్యనాథ్​

రామ్​లల్లాకు సాష్టాంగ నమస్కారం...

ayodhya latest news 2020
సాష్టాంగ నమస్కారం

అయోధ్యలోని రామజన్మభూమి వద్ద రామ్​లల్లాకు ప్రధాని మోదీ పూజలు చేశారు. ఆలయంలోకి ప్రవేశించే ముందు సాష్టాంగ నమస్కారం చేసిన ఆయన.. రాముడికి పూలమాల వేశారు. అనంతరం రామాలయంలోని ఉత్సవ విగ్రహానికి నైవేధ్యం పెట్టి హారతి ఇచ్చారు.

మొక్కను నాటి...

ayodhya latest news 2020
పారిజాత మొక్కను నాటిన మోదీ

రామాలయంలోని ఉత్సవ విగ్రహానికి పూజ అనంతరం పారిజాత మొక్కను నాటారు. ప్రధానితో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కూడా ఈ కార్యక్రమంలో వెంటే ఉన్నారు.

వైభవంగా భూమిపూజ...

ayodhya latest news 2020
భూమి పూజలో మోదీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా రామమందిర నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్‌దాస్‌, ఇతర ప్రముఖులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ayodhya latest news 2020
భూమి పూజలో మోదీ

భూమి పూజలో నక్షత్రాకారంలో ఉన్న 5 వెండి ఇటుకలను ఉపయోగించారు. ఆ వెండి ఇటుకలు 5 విగ్రహాలకు ప్రాతినిధ్యం వహిస్తాయని ఆగమ పండితుల చెప్పారు. హరిద్వార్‌ నుంచి తీసుకొచ్చిన పవిత్ర గంగాజలం, పుణ్యనదీ జలాలను భూమిపూజలో వినియోగించారు. అయోధ్యలో భూమి పూజ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శిలాఫలకం ఆవిష్కరణ...

ayodhya latest news 2020
పోస్టల్​ స్టాంప్​ విడుదల చేసిన ప్రధాని

రామమందిర నిర్మాణ శిలాఫలకాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. మహత్తర కార్యానికి గుర్తుగా పోస్టల్​ స్టాంప్​ విడుదల చేశారు.

ayodhya latest news 2020ayodhya latest news 2020
భూమి పూజ మంటపం వద్ద మోదీ

మహద్భాగ్యంగా మోదీ అభివర్ణన...

ayodhya latest news 2020
ప్రసంగిస్తున్న మోదీ

భూమిపూజ అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. జై శ్రీరామ్​ నినాదాలతో మోదీ ప్రసంగాన్ని ప్రారంభించారు. నేటి జయజయధ్వనాలు ప్రపంచంలో ఉన్న కోట్ల మంది భక్తులకు వినిపిస్తాయని చెప్పారు. మందిర నిర్మాణానికి భూమిపూజ చేయడం తన మహద్భాగ్యం అన్నారు మోదీ. ఈ అవకాశాన్ని రామ మందిర ట్రస్టు కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.