దేశంలో కరోనా కేసులు 5 లక్షల దాటిన క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై మరోమారు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. "ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనంగా ఉన్నారు.. కానీ, కేసులు పెరుగుతూనే ఉన్నాయి" అని వ్యంగాస్త్రాలు సంధించారు. కరోనా వైరస్‌పై పోరాడలేక ప్రధాని లొంగిపోయారని ఆరోపించారు.
" దేశంలోని కొత్త ప్రాంతాలకు కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. కానీ, దానిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళిక లేదు. ప్రధాని మౌనం వీడటం లేదు. ఆయన లొగిపోయారు. వైరస్‌పై పోరాడటానికి నిరాకరిస్తున్నారు. "
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
కరోనాకు అడ్డుకట్ట వేయటంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆరోపించారు రాహుల్. కొద్ది రోజులుగా ఐసీఎంఆర్, మంత్రుల సమావేశాలు జరగటం లేదని, కనీసం ఆరోగ్య శాఖ రోజువారీ బ్రీఫింగ్ కూడా చేయటం లేదనే కొన్ని నివేదికలు ట్వీట్‌కు ట్యాగ్ చేశారు.
ఇదీ చూడండి: తెలుగు జాతి అనర్ఘరత్నం పీవీ నరసింహారావు