ETV Bharat / bharat

'సకాలంలో తీసుకున్న నిర్ణయాల వల్లే కరోనా కట్టడి'

author img

By

Published : Jun 16, 2020, 3:11 PM IST

Updated : Jun 16, 2020, 4:27 PM IST

pm-modi-interacts-with-cms-of-states-amid-corona-virus-outbreak
కరోనా పరిస్థితులపై సీఎంలతో మోదీ సమీక్ష

16:26 June 16

సకాలంలో...

సకాలంలో తీసుకున్న నిర్ణయాల వల్లే దేశంలో కరోనా వ్యాప్తిని నియంత్రించగలిగామని ప్రధాని మోదీ తెలిపారు. 

16:20 June 16

ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది...

గత కొన్ని వారాలుగా చేపట్టిన చర్యల వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని ప్రధాని మోదీ వెల్లడించారు. అయితే కరోనాపై పోరులో ప్రతి భారతీయుడి ప్రాణం ముఖ్యమని అన్నారు. దేశ ప్రజలు కరోనాపై యుద్ధానికి చేసిన కృషి, కలిసికట్టుగా ముందుకు సాగిన తీరు.. భవిష్యత్తులో గుర్తిండిపోతుందని పేర్కొన్నారు.  

మాస్కులు లేకుండా ఇంటి నుంచి బయటకు వచ్చే ఆలోచనలు విరమించుకోవాలని పునరుద్ఘాటించారు మోదీ. మార్కెట్లు, వ్యాపార కేంద్రాల్లో శానిటైజర్లను తప్పనిసరిగా ఉపయోగించాలన్నారు.

16:13 June 16

భవిష్యత్తులో..

అన్​లాక్​-1లో నేర్చుకున్న పాఠాలు భవిష్యత్తు కార్యచరణకు ఉపయోగపడతాయని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. కరోనా వైరస్​ వ్యాప్తిపై సీఎంలతో జరుగుతున్న భేటీలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సమావేశం ద్వారా క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎంల సూచనలు.. కరోనాపై పోరులో భవిష్యత్తు వ్యూహాలకు సహాయపడతాయని పేర్కొన్నారు మోదీ.

15:45 June 16

భేటీ ప్రారంభం...

కరోనా వైరస్​పై సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం మొదలైంది. ఈ భేటీకి 21 రాష్ట్రల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన లెఫ్టినెంట్​ గవర్నర్లు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జరుగుతున్న ఈ సమావేశంలో కరోనా వైరస్​ పరిస్థితులపై చర్చించనున్నారు. 

కరోనా వైరస్​పై సీఎంలతో చర్చలు జరపడం ఇది ఆరోసారి.

15:42 June 16

కరోనా కట్టడి చర్యలు

ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నేపథ్యంలో కొవిడ్-19 కట్డడికి తీసుకుంటున్న చర్యలపై శనివారం సమీక్ష నిర్వహించారు మోదీ. ఆయన సూచన మేరకే కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న దిల్లీలో అమిత్​ షా అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి కరోనా సవాళ్లను ఎదుర్కొనేందుకు కార్యచరణ రూపొందించారు.

15:14 June 16

రెండు రోజుల పాటు..

మరికొద్ది సేపట్లో జరగబోయే వీడియో కాన్ఫరెన్స్​ సమావేశంలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్​ గవర్నర్లు, అధికారులతో మాట్లాడతారు మోదీ. పంజాబ్​, కేరళ, గోవా, ఉత్తరాఖండ్​, ఝార్ఖండ్​, ఈశాన్య రాష్ట్రాల సీఎంలు, ఇతర కేంద్రపాలిత ప్రాంత అధికారులు ఇందులో పాల్గొంటారు.

బుధవారం జరగబోయే వీడియో కాన్ఫరెన్స్​ సమావేశంలో 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్​తో మాట్లాడనున్నారు ప్రధాని. వైరస్ ప్రభావం అధికంగా ఉన్న మహారాష్ట్ర, బంగాల్​, దిల్లీ, కర్ణాటక, గుజరాత్​, బిహార్, ఉత్తర్​ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కరోనా అంశమై చర్చిస్తారు.

14:59 June 16

మరికాసేపట్లో...

వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరికొద్దిసేపట్లో సమావేశం కానున్నారు. వీడియో కాన్పరెన్స్​ ద్వారా జరగనున్న ఈ భేటీలో దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా పరిస్థితులపై విస్తృతంగా చర్చించనున్నారు. ఆయా సీఎంల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. 

Last Updated : Jun 16, 2020, 4:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.