ETV Bharat / bharat

నేడు వారణాసికి మోదీ..  పలు ప్రాజెక్టుల ప్రారంభం

author img

By

Published : Feb 16, 2020, 5:11 AM IST

Updated : Mar 1, 2020, 12:01 PM IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. నగరంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఐఆర్​సీటీసీకి చెందిన మహాకాల్ ఎక్స్​ప్రెస్ సహా 30కి పైగా ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో వారణాసిలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

MODI
నేడు వారణాసిలో మోదీ పర్యటన

నేడు వారణాసికి మోదీ

ప్రముఖ ఆధ్యాత్మిక నగరం, తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు పర్యటించనున్నారు. వారణాసిలో 430 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఐఆర్​సీటీసీకి చెందిన మహాకాల్ ఎక్స్‌ప్రెస్‌ సహా 30కి పైగా ప్రాజెక్టులను మోదీ ప్రారంభిస్తారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అనంతరం ఓ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారని.. చౌకఘాట్-లెహర్​తార వంతెన, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో వేదిక్ సైన్స్ కేంద్రాలను ప్రారంభిస్తారని సమాచారం.

దీన్​దయాళ్​ విగ్రహ ఆవిష్కరణ..

వారణాసిలోని శ్రీ జగద్గురు విశ్వారాధ్య గురుకులం శతాబ్ది వేడుకల ముగింపు ఉత్సవాల్లోనూ మోదీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా 19 భాషల్లోకి అనువదించిన శ్రీ సిద్ధాంత శిఖామణి గ్రంథాన్ని.. దానికి సంబంధించిన మొబైల్ యాప్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ స్మారక కేంద్రాన్ని ప్రారంభించనున్న మోదీ.. అక్కడ ఏర్పాటు చేసిన పండిట్ దీన్‌దయాళ్ 63 అడుగుల పంచలోహ విగ్రహాన్ని జాతికి అంకితం చేస్తారు. ఈ విగ్రహాన్ని తయారు చేసేందుకు 200మంది కళాకారులు ఏడాదిపాటు రాత్రింబవళ్లు శ్రమించారు.

కాశీ ఏక్​రూప్​ అనేక్​ ప్రారంభం..

ఉత్తరప్రదేశ్ నలుమూలల నుంచి వచ్చే హస్తకళా ఉత్పత్తులను ప్రదర్శించే 'కాశీ ఏక్ రూప్ అనేక్' కార్యక్రమాన్ని మోదీ ప్రారంభిస్తారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన దేశ, విదేశీ కళాకారులు, ఔత్సాహికులతో సంభాషిస్తారు.

భద్రత కట్టుదిట్టం..

ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో నగరం మొత్తం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. అభివృద్ధి కార్యక్రమాలు, బహిరంగ సభల ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు.

ఇదీ చూడండి: ప్రపంచానికి యోగా నేర్పించనున్న భారతీయుడు!

Last Updated : Mar 1, 2020, 12:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.