ETV Bharat / bharat

'ఫిట్​నెస్​పై ప్రజల్లో మరింత అవగాహన అవసరం'

author img

By

Published : Feb 22, 2020, 7:53 PM IST

Updated : Mar 2, 2020, 5:20 AM IST

ఖేలో ఇండియా ప్రప్రథమ అంతర్​ విశ్వవిద్యాలయ క్రీడాపోటీలను ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఒడిశా భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నమెంట్​ను దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రారంభించారు. ఖేలో ఇండియా.. భారత క్రీడారంగ చరిత్రను మరింత ముందుకు తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని.

modi
'ఫిట్​నెస్​పై ప్రజల్లో మరింత అవగాహన అవసరం'

ఖేలో ఇండియా పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబరచి, ఫిట్​నెస్​పై దేశ ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఖేలో ఇండియా కార్యక్రమం భారత క్రీడారంగాన్ని మరో దశకు తీసుకెళ్తుందని వ్యాఖ్యానించారు.

ఒడిశాలో జరుగుతున్న ఖేలో ఇండియా ప్రప్రథమ అంతర్​ విశ్వవిద్యాలయ క్రీడా పోటీలను దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు ప్రధాని. భారత క్రీడారంగానికి చారిత్రక దినంగా అభివర్ణించారు.

"ఖేలో ఇండియా పోటీల్లో మీరు చేస్తున్న కృషి... మీ కలలు, మీ కుటుంబాలు, దేశ కలలను నిజం చేస్తుంది. మీరు పోటీల్లో గెలవాలి. ఫిట్​నెస్​ దిశగా దేశాన్ని చైతన్యం చేయాలి. ఈ సంకల్పంతో మీరు మైదానంలో పోటీల్లో పాల్గొనాలి. ఈ కార్యక్రమం ఒక టోర్నమెంట్ ప్రారంభోత్సవం మాత్రమే కాదు. భారత్ క్రీడారంగంలో మరో శకానికి ఆరంభం. ఖేలో ఇండియా అభియాన్​ దేశం నలుమూలలా క్రీడల పట్ల ఆసక్తి, యువ క్రీడాకారులను కనుగొనడంలో ముఖ్య భూమిక పోషిస్తోంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు చెందిన క్రీడాకారులు గత ఖేలో ఇండియా పోటీల్లో అద్భుత ప్రదర్శన చేశారు. భారత క్రీడారంగంలో నూతన ఆశలను రేకెత్తించారు."

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

ఈ కార్యక్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్​ రిజుజు, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ట్రంప్​కు దిల్లీలో ప్రత్యేక విందు- మెనూ చాలా స్పెషల్​

Last Updated : Mar 2, 2020, 5:20 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.