పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ప్రధాని నరేంద్రమోదీ లేఖ రాశారు. రెండో సారి ప్రధానిగా ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇమ్రాన్ రాసిన లేఖకు మోదీ ప్రత్యుత్తరం పంపారు. కర్తార్‌పుర్ నడవా త్వరగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారని విదేశాంగ శాఖ తెలిపింది.
"పాక్ ప్రధానికి మోదీ రాసిన లేఖలో కర్తార్‌పుర్ నడవా విషయం ప్రస్తుతించారు. కర్తార్‌పుర్ నడవా త్వరగా ప్రారంభమయ్యేలా కృషి చేస్తున్నామని తెలిపారు. మీరూ అందుకు సహకరించాలి. ఇది ఏడాది పొడవునా పనిచేయాలన్నారు."
- రవీశ్ కుమార్, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి
కర్తార్‌పుర్ నడవా నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా యాత్రికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో వారి ఆకాంక్షలకు అనుగుణంగా పూర్తి చేసేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రవీశ్ తెలిపారు.
2018 నవంబర్‌లో కర్తార్‌పుర్ గురుద్వారా దర్బార్ సాహిబ్ నుంచి భారత్‌లోని గురుదాస్‌పుర్ డేరా బాబా నానక్‌కు అనుసంధానం చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. అదే ఏడాది నవంబర్ 26న గురుదాస్‌పుర్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ శంకుస్థాపన చేశారు. రెండ్రోజుల తర్వాత కర్తార్‌పుర్‌లోని నరోవాల్‌లో పాక్ పధాని ఇమ్రాన్ ఖాన్ పునాది రాయి వేశారు.
ఇదీ చూడండి: 'కర్తార్‌పుర్'పై దాయాదుల చర్చ